Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

20 June 2025

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

20 June 2025

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

20 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Naidu Fitness Secret,యోగా సాధనతో నిత్య యువకుడై.. నవ్యాంధ్ర రథ సారథి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. – how yoga become part of chandrababu naidu life here is ap cm fitness journey
ఆంధ్రప్రదేశ్

Chandrababu Naidu Fitness Secret,యోగా సాధనతో నిత్య యువకుడై.. నవ్యాంధ్ర రథ సారథి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. – how yoga become part of chandrababu naidu life here is ap cm fitness journey

.By .20 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Naidu Fitness Secret,యోగా సాధనతో నిత్య యువకుడై.. నవ్యాంధ్ర రథ సారథి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. – how yoga become part of chandrababu naidu life here is ap cm fitness journey
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chandrababu Naidu Yoga Journey: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన ఫిట్‌నెస్‌కు హెల్దీ ఫుడ్‌తో పాటుగా మరో సీక్రెట్ కూడా ఉందని మీకు తెలుసా.. ఆయన ఈ వయసులోనూ ఇంత యాక్టివ్‌గా ఉన్నారంటే కారణం యోగానే అని ఎంతమందికి తెలుసు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి నేటి వరకు యోగాను ప్రోత్సహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • 75 ఏళ్ల వయసులోనూ నవయువకుడిలా చంద్రబాబు
  • హెల్దీ ఫుడ్ మాత్రమే కాదు మరో సీక్రెట్ కూడా ఉంది
  • ఏపీ సీఎం జీవితంలో యోగాకు ఉన్న ప్రాధాన్యం ఏంటి
చంద్రబాబు యోగా బ్రాండ్ అంబాసిడర్
చంద్రబాబు యోగా బ్రాండ్ అంబాసిడర్ (ఫోటోలు– Samayam Telugu)
ఆయన వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులోనూ యువకులతో పోటీ పడి పనిచేస్తారు. ఆయన వీధుల్లో నడుస్తున్నారంటే.. అధికారులు, కార్యకర్తలు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. రోజుకు 18 గంటలు పని చేసినా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపించరు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవును.. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . 2024లో విజయవాడలో వరదల విపత్తు వచ్చిన సమయంలో ఆయన నగర వీధులన్నీ కలియతిరుగుతూ బాధితులకు సాయం చేసిన తీరు చూసి యావత్ దేశమే ఆశ్చర్యపోయింది. ఎన్నికల ప్రచార సమయంలో యువకుడిలా ఎవరి సాయం లేకుండా వ్యాన్ పైకెక్కిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది. మండే వేసవి అయినా, వణికించే చలిలో అయినా.. మోకాళ్ల లోతు వరదల్లో అయినా.. 75 ఏళ్ల వయసులో ఆయన పనిచేసే తీరు అందరినీ విస్మయపరుస్తుంది. రాత్రి 10 గంటల వరకూ ఏ అలుపూ లేకుండా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ, దిశానిర్దేశం చేసే తీరు అందరికీ స్ఫూర్తినిస్తుంది. చంద్రబాబుకు ఇంతటి ఫిట్‌నెస్‌కు కారణం ఏంటంటే.. ‘యోగా’. రాజకీయ జీవితం మొదలు పెట్టిన నాటి నుంచే ఆయన జీవితంలో యోగా ఒక భాగమైంది. ‘నాయకుడు ఫిట్‌గా ఉంటేనే.. ప్రజలకు ఎక్కువగా మేలు చేయగలడు’ అని చెప్పే చంద్రబాబు నాయుడి జీవితంలో యోగాకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? ఆసక్తికర వివరాలు.. యావత్ ప్రపంచం జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. దేశ విదేశాల్లో పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ యోగా డే లో భాగస్వాములవుతున్నారు. భారత్‌లో ఈసారి యోగా డే వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామ్య పార్టీగా ఉన్నందున మోదీ ఈసారి ఏపీని ఈ కార్యక్రమానికి ఎంచుకున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు. కానీ, యోగాతో దశాబ్దాల కిందటే చంద్రబాబుకు బంధం పెనవేసుకుందని ఎంత మందికి తెలుసు?

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాకు ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటే నమ్ముతారా.. ఈ మాట చెబితే కొంత మందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ, చంద్రబాబును దగ్గరి నుంచి చూసినవారికి, ఆయన గురించి తెలిసినవారికి యోగాకు ఆయన చేసిన సేవ ఏంటో తెలుస్తుంది.

చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది.. ఓవైపు పార్టీ, కార్యకర్తల మంచిచెడులు చూసుకుంటూనే.. మరోవైపు పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉంటారు. ప్రతి రోజూ ఎన్నో రకాల ఒత్తిడి, శారీరక శ్రమ కచ్చితంగా ఉంటుంది.. వీటన్నిటిని తట్టుకుని చంద్రబాబు ఒక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు. ఆయనకు ప్రస్తుతం 75 ఏళ్లు.. ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. అందుకే ఆయన పదే, పదే తన ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తుంటారు.. ఆయన తీసుకునే జాగ్రత్తల్ని చెప్తుంటారు. చంద్రబాబు హెల్త్ సీక్రెట్‌లలో యోగా కూడా ఒక భాగమని మీకు తెలుసా.. అవును చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒక్కమాటలో చెప్పాలంటే యోగా ఒక అలవాటు కాదు ఆయన జీవితంలో ఒక భాగంగా మారింది.

చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఒత్తిడి మాత్రం తప్పదు.. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకోవడానికి యోగా, ధ్యానం ఎంతో సహాయపడ్డాయని ఎన్నోసార్లు చెప్పారు. అందుకే ఆయన యోగా చేయడమే కాదు ప్రజలు కూడా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవాలని ప్రస్తావిస్తుంటారు. ఆయన చెప్పడం కాదు.. నిజ జీవితంలో కూడా ఆచరిస్తున్నారు. నిత్య విద్యార్థి అన్నట్లుగా ఆయన యోగా గురించి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వేకువజామునే యోగా, ధ్యానం చేయడం ఆయన జీవితంలో ఒక భాగమైంది. మానసిక ప్రశాంతతో పాటుగా ఏకాగ్రత కోసం యోగా చేయడం అలవాటు. తన జీవితంలో యోగాతో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఒక క్రమశిక్షణకు అలవాటుపడ్డానని చెబుతుంటారు. చంద్రబాబు ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్‌గా ఉండటానికి యోగా, వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారం ప్రధాన కారణమని సతీమణి భువనేశ్వరి కూడా గతంలో ప్రస్తావించారు. ప్రతి రోజూ గంటన్నర నుంచి రెండు గంటల పాటూ యోగా, ధ్యానం, వ్యాయామాలు చేస్తుంటారని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగాను బాగా ప్రోత్సహించారు. యోగా ప్రాముఖ్యతను 30 ఏళ్ల క్రితమే గుర్తించారని మీకు తెలుసా.. అవును మీరు వింటున్నది నిజమే. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఎన్టీఆర్ భవన్‌లో 1994లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, పార్టీ నేతలకు నిపుణులతో యోగా, ధ్యానంలో శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 2014 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రతి ఏటా యోగాకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్, ఇషా ఫౌండేషన్‌ ఫౌండర్ సద్గురు జగ్గీ వాసుదేవ్‌ల సహాకారంతో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో శిక్షణా తరగతుల్ని కూడా నిర్వహించారు. 2014-2019 మధ్య ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక యోగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.

చంద్రబాబును 2023లో అరెస్టైన తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.ఆ సమయంలో జైల్లో కూడా క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేసేవారని చెబుతుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి ఏటా యోగా దినోత్సాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరు యోగా డే రోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాదు విద్యా సంస్థల్లో యోగాను తప్పనిసరి చేయాలనే ఆలోచన కూడా ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. విద్యార్థులకు 9వ తరగతి నుంచి యోగాను తప్పనిసరి చేయాలని సూచించారు. భవిష్యత్‌లో యోగాను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చడంపై తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయన్నారు. యోగా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుందని.. క్రమశిక్షణతో పాటుగా ఏకాగ్రత, మానసిక బలం, ఒత్తిడిని జయించడం, సంక్లిష్ట పరిస్థితుల్ని సమర్థవంతం ఎదుర్కోవడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి యోగా ఎంతో సహాయపడుతుందని చెబుతుంటారు. యోగా ఒక మతానికి సంబంధించినది కాదు.. అది ఒక శాస్త్రీయ విధానమని చంద్రబాబు పదే, పదే చెబుతుంటారు. యోగా మన దేశానికి గొప్ప వరమని, వారసత్వ సంపదని.. ప్రివెంటివ్ హెల్త్‌కు యోగా బెస్ట్ మెడిసన్ అంటుంటారు చంద్రబాబు.

అలాగే యోగా విశ్వవిద్యాలయాన్ని కూడా ఒకటి ప్రారంభించాలని చెబుతుంటారు చంద్రబాబు.. ఆ దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి. యోగాతో పాటుగా నేచురోపతి కోర్సులతో ఒక డీమ్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి చంద్రబాుబ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా చెప్పారు. అమరావతిలో యోగా, నేచురోపతి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమాన్ని కూడా ఆ దిశగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. యోగా కోసం నాన్ ప్రాఫిట్ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు.

ఈ ఏడాది యోగాంధ్ర-2025 పేరుతో విశాఖపట్నం వేదికగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరవుతున్నారు. నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజా ప్రతినిధుల్ని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మంచి అడ్మినిస్ట్రేటర్, సీనియర్ రాజకీయ నేతగానే కాదు.. యోగాకు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు ఉందనే చెప్పాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు

20 June 2025

Prakasam district: ఆవుల మంద తిరగబడటంతో తోక ముడిచి తుర్రుమన్న పెద్దపులి

20 June 2025

కొట్లాడితే ఏమొస్తుంది.. కూర్చుని మాట్లాడుకుంటే పోలా.. బేసిన్‌లో నీళ్లకు భేషజాలు ఎందుకు?: సీఎం రేవంత్

20 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

20 June 2025

పేరున్న రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఓ బిల్డర్‌ నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్…

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

20 June 2025

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

20 June 2025

Arundhati Movie: అరుంధతి సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్.. అనుష్క పాత్రను ఆమె చేయాల్సిందట..

20 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

20 June 2025

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

20 June 2025

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

20 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.