Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sadhguru: యోగాతోనే వాటిని అధిగమించగలం.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిబిరాలు

21 June 2025

Tollywood Updates: ది రాజాసాబ్‌ కథపై దర్శకుడు క్లారిటీ.. పెద్ది టీమ్ నుంచి అప్‌డేట్..

21 June 2025

Honda Cars: ఆ కారు స్పోర్ట్ ఎడిషన్ రిలీజ్ చేసిన హోండా.. స్టన్సింగ్ లుక్‌తో అదిరే ఫీచర్స్

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Lucky Moles on Your Body: అదృష్టాన్ని తెలియజేసే పుట్టుమచ్చలు శరీరంపై ఏ భాగాలపై ఉంటాయంటే..
తాజా వార్తలు

Lucky Moles on Your Body: అదృష్టాన్ని తెలియజేసే పుట్టుమచ్చలు శరీరంపై ఏ భాగాలపై ఉంటాయంటే..

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Lucky Moles on Your Body: అదృష్టాన్ని తెలియజేసే పుట్టుమచ్చలు శరీరంపై ఏ భాగాలపై ఉంటాయంటే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Lucky Moles on Your Body: అదృష్టాన్ని తెలియజేసే పుట్టుమచ్చలు శరీరంపై ఏ భాగాలపై ఉంటాయంటే..

శరీరంపై పుట్టుమచ్చలు కేవలం అందానికి గుర్తు మాత్రమే కాదు. అవి అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతం. సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం శరీరంలోని కొన్ని భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇవి మానుషి ఉజ్వల భవిష్యత్తు, సంపద, కీర్తి , ఆనందాన్ని సూచిస్తాయి. శరీరంలో ఏ ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా, అదృష్టంగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం.

ఏ శరీర భాగాలపై పుట్టుమచ్చలుంటే శుభప్రదంగా భావిస్తారంటే

నుదిటిపై ఉన్న పుట్టుమచ్చ
ఎవరికైనా నుదిటి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే..అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు ధనవంతులు, విజయవంతమైనవారు, సామాజికంగా గౌరవించబడతారు. వీరు తమ కృషి, అంకితభావంతో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మరోవైపు నుదిటి ఎడమ వైపున ఉన్న పుట్టుమచ్చ కొంతవరకు దుబారా చేసే స్వభావాన్ని సూచిస్తుంది.

కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ
రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. దూరదృష్టితో పని చేస్తారు. వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక ధోరణి కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం కలుగదు

ముక్కు మీద పుట్టుమచ్చ
ముక్కు మీద పుట్టుమచ్చ ఉండటం కూడా అదృష్టానికి సంకేతం. ముక్కు చివర పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు తరచుగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. వీరు తమ జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తారు. అలాంటి వ్యక్తులు ఉల్లాసంగా , శక్తివంతంగా ఉంటారు. వీరు తాము చేసే వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు.

పెదవి పైన పుట్టుమచ్చ
పై పెదవి కుడి వైపున ఉన్న పుట్టుమచ్చ ఆ వ్యక్తి స్వభావరీత్యా చాలా ఆప్యాయంగా, ఉదారంగా ఉంటాడని సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇతరులకు సహాయం చేస్తారు. దయతో ఉంటారు. వీరికి జీవితంలో చాలా ప్రేమ, గౌరవం లభిస్తుంది.

అరచేతిలో పుట్టుమచ్చ
వ్యక్తి కుడి అరచేతిలో ముఖ్యంగా ఉంగరపు వేలు లేదా చిటికెన వేలు కింద పుట్టుమచ్చ ఉంటే.. అది సంపద , అదృష్టానికి సూచిక. అలాంటి వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు . జీవితంలో అన్ని సౌకర్యాలను పొందుతారు. మరోవైపు ఎడమ అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కొంచెం కష్టపడవచ్చు. అయితే వీరు చివరికి విజయం సాధిస్తారు.

అరికాళ్ళపై పుట్టుమచ్చ
అరికాళ్ళపై పుట్టుమచ్చ ఉండటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలాంటి ప్లేస్ లో పుట్టుమచ్చ ఉన్నవారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వీరు ధైర్యంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడరు. వీరు సమాజంలో గౌరవం పొందుతారు.

కడుపు మీద పుట్టుమచ్చ
కడుపుపై ​​ఉన్న పుట్టుమచ్చలు సంపద , మంచి ఆహారం పట్ల మక్కువను సూచిస్తాయి. పుట్టుమచ్చ నాభి దగ్గర ఉంటే.. ఆ వ్యక్తి సంపదను పొందుతాడు . సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో కడుపు మీద పుట్టుమచ్చ అతిగా తినే అలవాటును కూడా సూచిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tollywood Updates: ది రాజాసాబ్‌ కథపై దర్శకుడు క్లారిటీ.. పెద్ది టీమ్ నుంచి అప్‌డేట్..

21 June 2025

Honda Cars: ఆ కారు స్పోర్ట్ ఎడిషన్ రిలీజ్ చేసిన హోండా.. స్టన్సింగ్ లుక్‌తో అదిరే ఫీచర్స్

21 June 2025

Viral Video: ఓరీ దేవుడో ఇదేక్కడి కర్మరా సామీ.. చెప్పులతో పకోడీల తయారీ..! ఎలా తింటారంటే..

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

Sadhguru: యోగాతోనే వాటిని అధిగమించగలం.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిబిరాలు

21 June 2025

యోగా స్వేచ్ఛను ఇచ్చే వ్యవస్థ.. అని.. శారీరక, మానసిక శ్రేయస్సు కోసం యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సద్గురు జగ్గీ…

Tollywood Updates: ది రాజాసాబ్‌ కథపై దర్శకుడు క్లారిటీ.. పెద్ది టీమ్ నుంచి అప్‌డేట్..

21 June 2025

Honda Cars: ఆ కారు స్పోర్ట్ ఎడిషన్ రిలీజ్ చేసిన హోండా.. స్టన్సింగ్ లుక్‌తో అదిరే ఫీచర్స్

21 June 2025

Viral Video: ఓరీ దేవుడో ఇదేక్కడి కర్మరా సామీ.. చెప్పులతో పకోడీల తయారీ..! ఎలా తింటారంటే..

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Sadhguru: యోగాతోనే వాటిని అధిగమించగలం.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిబిరాలు

21 June 2025

Tollywood Updates: ది రాజాసాబ్‌ కథపై దర్శకుడు క్లారిటీ.. పెద్ది టీమ్ నుంచి అప్‌డేట్..

21 June 2025

Honda Cars: ఆ కారు స్పోర్ట్ ఎడిషన్ రిలీజ్ చేసిన హోండా.. స్టన్సింగ్ లుక్‌తో అదిరే ఫీచర్స్

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.