అలేఖ్య చిట్టి పికిల్స్.. మొన్నటివరకు ఈ పచ్చళ్లకు బాగా డిమాండ్ ఉండేది. రేట్లు ఎక్కువైనా రుచిగా ఉంటాయన్న కారణంతో చాలా మంది ఈ పికిల్స్ ను కొనుగోలు చేసేవారు.ఈ కారణంగానే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ భారీగా లాభాలు చవి చూశారు. కానీ పచ్చళ్లు రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్ పై ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయింది అలేఖ్య. అంతే అప్పటివరకు ఈ ముగ్గురి సిస్టర్స్ పై ఉన్న పాజిటివ్ ఓపినియన్ అంతా నెగెటివ్ గా మారిపోయింది. అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలి అంటే ఫస్ట్ కెరియర్ పైన ఫోకస్ చేయాలల్మా, పికిల్స్ కొనలేని వాడివి పెళ్లయ్యాక భార్యను ఎలా చూసుకుంటావు అంటూ వీరు మాట్లాడిన మాటలు చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో ఈ అక్కాచెల్లెళ్లపై మీమ్స్, ట్రోల్స్ వీడియోలు బాగా వైరలయ్యాయి. దీంతో దెబ్బకి పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చేసుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. అంతేకాదు ట్రోలింగ్ దెబ్బకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఐసీయూలో కూడా చేరింది అలేఖ్య. ట్రోల్స్ మరింత పెరిగిపోవడంతో దెబ్బకు అలేఖ్య సిస్టర్స్ దిగొచ్చారు. సోషల్ మీడియా వేదికగా తప్పు తమదేనని బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
కాగా ఈ వివాదం తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు అలేఖ్య చిట్టి సిస్టర్స్. ఆ మధ్యన లడ్డూల బిజినెస్ స్టార్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తమ పచ్చళ్ల దుకాణాన్ని మళ్లీ ఓపెన్ చేశారీ అక్కా చెల్లెళ్లు. ఈ విషయాన్ని వారే తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. మూడు రోజుల క్రితం అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైన సుమ త్వరలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ తో మళ్లీ మీ ముందుకు వస్తామని వీడియో షేర్ చేసింది. ఇప్పుడు మళ్లీ రమ్య కూడా అదే విషయం చెబుతూ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను రిలీజ్ చేసింది.
‘అలేఖ్య చిట్టి పికిల్స్ 2.0 తో అయితే మళ్లీ మీ ముందుకు వచ్చేశాం. మేము బిజినెస్ క్లోజ్ చేసిన తర్వాత ఈ రెండు నెలల్లో మేము ఏ తప్పులు చేశాం? ఎక్కడ ఎలాంటి తప్పు జరిగింది? ఇలా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్నాం. ఇక మేము సెట్ అయ్యాం అనుకున్న తర్వాతనే ఇప్పుడు మీ ముందుకి వచ్చాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా పచ్చళ్లు కొనగలిగే ధరలతోనే మీ ముందుకు వచ్చాము. ఇక కెరియర్ పై ఫోకస్ పెట్టి మళ్లీ మా పచ్చళ్ల బిజినెస్ ని మొదలుపెట్టాం’ అని రమ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి
వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..