సాధారణంగా సినీరంగంలో కొందరు స్టార్స్ ఐకానిక్ పాత్రలు పోషించి జనాల హృదయాల్లో నిలిచిపోతారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో తమ అద్భుతమైన నటనతో సినిమా పరిశ్రమలో తమదైన ముద్రవేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం పార్వతి దేవి పాత్రతో అడియన్స్ మదిలో నిలిచిపోయింది. హిందీలో పాపులర్ అయిన మహాదేవ్ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆమె.. జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొంది. చిన్న వయసులోనే వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత మరిన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమె పేరు పూజా బెనర్జీ. నార్త్ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు.
హిందీలో రోడీస్, కామెడీ సర్కస్, బిగ్ బాస్ వంటి అనేక రియాల్టీ షోల ద్వారా పాపులర్ అయ్యింది పూజా బెనర్జీ. ఆమె తెలుగు చిత్రాల్లోనూ కీలకపాత్రలు పోషించింది. అలాగే బెంగాలీ, మరాఠీ, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటించింది. సినీ పరిశ్రమలో ఇప్పుడు ప్రసిద్ధ నటీమణులలో ఆమె ఒకరు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆమె 15 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి తన ప్రియుడు అరుణోయ్ చక్రవర్తిని 2004లో వివాహం చేసుకుందని సమాచారం. కానీ పెళ్లైన 9 సంవత్సరాలకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన నటనా జీవితంపై ఫోకస్ చేసింది పూజా. ఆమె డెవోన్ కే దేవ్ మహాదేవ్ సీరియల్లో పార్వతి పాత్రలో నటించింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూడలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె తన తోటి నటుడు కునాల్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు 2017లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత ఘనంగా వివాహం చేసుకోవాలనుకున్నారు. కోవిడ్ వీరిద్దరి జీవితాన్ని మార్చేసింది. పెళ్లికి ముందే పూజా బాబుకు జన్మనిచ్చింది.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..