అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం (జూన్ 21)న దేశవ్యాప్తంగా యోగాకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ముంబైలో నిర్వహించిన యోగా ఈవెంట్ కు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో ఒక ప్రముఖ హీరోయిన్ కూడా ఉంది. కానీ అక్కడ ఆమె చేసిన పని తీవ్ర విమర్శల పాలైంది. ఇప్పుడు అందరూ ఆమెను తిట్టేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ ముద్దుగుమ్మపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. తెలుపు దుస్తుల్లో యోగా ఈవెంట్ కు హాజరైన ఈ హీరోయిన్ సొంతంగా తన షూలు కూడా తీసుకోలేకపోయింది. ఈ పనికి అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్ కాలు పట్టుకుని ఆమె షూ లేస్ తీసింది.. ఇంతలో మరో కాలి షూ కూడా తీసేయమని సదరు హీరోయిన్ వేలు పెట్టి చూపించింది. దీంతో ఆ మహిళా వాలంటీర్ మరో కాలి షూ కూడా తీసేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సదరు హీరోయిన్ పై మండిపడుతున్నారు. ‘నీ చేతులతో నువ్వు షూ లేస్ తీసుకోలేవా? ‘నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేయడానికి వచ్చావా?’డబు, పాపులారిటీ చూసి మీ గర్వం తలకెక్కినట్లుంది’ అంటూ నెటిజన్లు సదరు హీరోయిన్ పై మండిపడుతున్నారు. ఇలా ఇంటర్నేషనల్ యోగా డే రోజున నెటిజన్లతో తిట్లు తిన్న హీరోయిన్ మరెవరో కాదు నుష్రత్ బరుచా. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఆమె తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. సుమారు 15 ఏళ్ల క్రితం శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ (2010) సినిమాలో నుష్రత్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇదిగో..
నుష్రత్ బరుచా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..