బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఇటీవలే మురగదాస్ తో కలిసి సికిందర్ అనే సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆయన తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. 50 వయసు దాటినా కూడా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉన్నాడు. అంతే కాదు ఈమధ్య సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని ఓ గ్యాంగ్ బెదిరిస్తున్న విషయం తెలిసిందే.. ఇవే కాదు గతంలో సల్మాన్ ఖాన్ పై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతను ఓ చెత్త నటుడు అని కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరంటే..
ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..
బాలీవుడ్ లో తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరించిన భామల్లో కరీనా కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. అడపాదపడ సినిమాలు చేసి మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కరీనా కపూర్ సల్మాన్ ఖాన్ గురించి షాకింగ్ కామెట్స్ చేసింది.
ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది
పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కరీనా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పలు ఇంటర్వ్యూలతోనూ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ గురించి కామెంట్స్ చేసింది.” నేను సల్మాన్ అభిమానిని కాదు. నాకు అతనంటే నాకు ఇష్టం లేదు, అతను చాలా చెడ్డ నటుడు. అతను ఎప్పుడూ పక్కవారిని చాలా చులకనగా చూస్తుంటాడు’’ అని చెప్పుకొచ్చింది కరీనా కపూర్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరీనా వ్యాఖ్యల పై నెటిజన్స్ రకరాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి