సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో రకరకాల పనులు చేసే వారు. కొంతమంది సేల్స్ గర్ల్స్ గ మరికొంతమంది కాల్ సెంటర్స్ లో కూడా పని చేశారు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఐఏఎస్ అవ్వాల్సిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్ అవ్వకపోతే కలెక్టర్ అయ్యేది ఈ ముద్దుగుమ్మ.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ అమ్మడి అందానికి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..
ఆమె ఎవరో కాదు అందాల భామ రాశీ ఖన్నా.. అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది.
ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ, తెలుగు తమిళ్, హిందీ భాషల్లో రాశీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. గతంలో రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని, అయితే మోడలింగ్‌లో పై ఆసక్తి ఉండటంతో స్క్రీన్ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పింది. దీని తర్వాత తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది. దీని తర్వాత తెలుసు కదా..,తో పాటు మరో సినిమాలోనూ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ అందుకుంది రాశీ.
ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి