Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..

26 June 2025

గ్లాస్‌లో పసుపు వేసే రీల్ ట్రెండ్.. ఇది దెయ్యాలను ఆహ్వానించడమేనా?

26 June 2025

Bhishma Niti: భీష్ముడు అర్జునుడికి పాలన గురించి ఏమిచెప్పాడు? రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే..

26 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Ttd Reduces Hotels Rent,తిరుమల శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. భారీగా తగ్గింపు, ఐదేళ్లకు పెంపు.. జులై 19 వరకే ఛాన్స్ – ttd reduces tirumala hotels rent and invites tenders
ఆంధ్రప్రదేశ్

Tirumala Ttd Reduces Hotels Rent,తిరుమల శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. భారీగా తగ్గింపు, ఐదేళ్లకు పెంపు.. జులై 19 వరకే ఛాన్స్ – ttd reduces tirumala hotels rent and invites tenders

.By .26 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Ttd Reduces Hotels Rent,తిరుమల శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. భారీగా తగ్గింపు, ఐదేళ్లకు పెంపు.. జులై 19 వరకే ఛాన్స్ – ttd reduces tirumala hotels rent and invites tenders
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala TTD Hotels Rent Reduced: తిరుమలలో ప్రైవేట్ హోటళ్ల అద్దెలను తగ్గిస్తూ, గడువును ఐదేళ్లకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హోటళ్ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది, అర్హులైన హిందువులకు అవకాశం కల్పిస్తోంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 2 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి. జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 3న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

హైలైట్:

  • తిరుమలలో ప్రైవేట్ హోటల్స్
  • అద్దె తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం
  • టెండర్లకు ఆహ్వానించారు
తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ
తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ (ఫోటోలు– Samayam Telugu)
తిరుమలలో ప్రైవేట్ హోటళ్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై హోటళ్ల అద్దెలను టీటీడీ తగ్గించింది. అద్దె గడువును కూడా పెంచింది.. కొత్త హోటళ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో మూడేళ్లుగా ఉన్న అద్దె గడువును ఐదేళ్లకు పెంచింది.. తిరుమలలో ఐదు చిన్న హోటళ్లు, ఐదు పెద్ద హోటళ్లను కొత్తగా నిర్వహించడానికి టెండర్లు ఆహ్వానించింది. టెండరుదారులకు కొన్ని నిబంధనలు పెట్టింది.. ఈ నెల 23న ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ జూలై 19న ముగుస్తుంది. టెండర్ వేసే వ్యక్తి హిందువు అయి ఉండాలి. కనీసం పది హోటళ్లను నడుపుతూ ఉండాలి.. హోటల్ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు విధించారు.తిరుమలలో హోటళ్ల అద్దెలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వివరాలు.. కౌస్తుభం హోటల్ అద్దెను రూ.16.20 లక్షల నుంచి రూ.12.15 లక్షలకు తగ్గించారు. సప్తగిరి హోటల్ అద్దెను నెలకు రూ.12.99 లక్షల నుంచి రూ.9.75 లక్షలకు తగ్గించారు. ఎంఎంటీ క్యాంటీన్‌కు అద్దెను రూ.5.05 లక్షల నుంచి రూ.3.80 లక్షలకు తగ్గించారు. పీఏసీ(వెస్ట్)కు రూ.4.44 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు.. పీఏసీ(నార్త్‌)కు రూ.4.10 లక్షల నుంచి రూ.3.10 లక్షలకు తగ్గించింది టీటీడీ. హెచ్‌వీసీకు రూ.3.33 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు.. ఎస్‌ఎంసీ క్యాంటీన్‌కు రూ.3.88 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్నవాళ్లు టెండర్లు దాఖలు చేయొచ్చు.

శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు

తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. జూన్ 26న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించనున్నారు. ఉదయం 07 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన ఉదయం 11 – 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. సాయంత్రం 5 – 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. జూలై 01వ తేదీన ఉదయం 11 – 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 – 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ తేదీన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ అనంతరం, సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. భారీగా తగ్గింపు, ఐదేళ్లకు పెంపు.. జులై 19 వరకే ఛాన్స్

జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం రద్దు చేశారు. జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం సేవలు రద్దు చేశారు. జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Amaravati Tenders Finalization,అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు.. టెండర్లు ఖరారు చేసిన ప్రభుత్వం – tenders finalized for construction of integrated state secretariat and hod towers in amaravati

26 June 2025

Gaming Apps: శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో ఆటలు.. ఆన్‌లైన్‌లో పుట్టుకొస్తున్న గేమింగ్ యాప్స్!

26 June 2025

Pawan Kalyan: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

26 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..

26 June 2025

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్…

గ్లాస్‌లో పసుపు వేసే రీల్ ట్రెండ్.. ఇది దెయ్యాలను ఆహ్వానించడమేనా?

26 June 2025

Bhishma Niti: భీష్ముడు అర్జునుడికి పాలన గురించి ఏమిచెప్పాడు? రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే..

26 June 2025

మరోసారి దాతృత్వం చాటుకున్న అదానీ.. పూరి రథయాత్రకు తరలివచ్చే భక్తులకు ఫ్రీ..!

26 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..

26 June 2025

గ్లాస్‌లో పసుపు వేసే రీల్ ట్రెండ్.. ఇది దెయ్యాలను ఆహ్వానించడమేనా?

26 June 2025

Bhishma Niti: భీష్ముడు అర్జునుడికి పాలన గురించి ఏమిచెప్పాడు? రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే..

26 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.