తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు లయ. అందం, అభినయంతో ఇండస్ట్రీలో సత్తా చాటిన అచ్చ తెలుగమ్మాయి. ఆనతికాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సహజమైన యాక్టింగ్… చక్కని చిరునవ్వుతో జనాల హృదయాలను గెలుచుకుంది. భద్రం కొడుకో సినిమాతో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత హీరో వేణు తొట్టెంపూడి నటించిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.