Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: 14 ఏళ్లకే టాప్ హీరోయిన్.. చిరంజీవితో 19.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్..

27 June 2025

Krishna District: చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!

27 June 2025

Tirupati Tdp Leader House Robbery,టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు – robbery in tdp leader prakash rao house in tirupati district

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Land Allocates To Reliance,ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt land allocated to reliance industries limited orvakal near kurnool
ఆంధ్రప్రదేశ్

Ap Govt Land Allocates To Reliance,ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt land allocated to reliance industries limited orvakal near kurnool

.By .26 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Land Allocates To Reliance,ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt land allocated to reliance industries limited orvakal near kurnool
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం.. తాజాగా భూమిని కేటాయించింది. రిలయన్స్ కంపెనీ రూ.1622 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ రిలయన్స్ ప్రాజెక్టు కోసం 80 ఎకరాల భూమిని కేటాయించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ
ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్న తరుణంలో.. రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కర్నూలు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగ కల్పనకు గణనీయమైన ఊతం ఇవ్వనుంది.కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి అనుమతి మంజూరు చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో శీతల పానీయాలు, జ్యూస్‌లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం కల్పించగా.. తాజాగా భూమిని కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి.. పరోక్షంగా మరో 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం కల్పించిన ఈ ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ 80 ఎకరాల భూమిని కేటాయించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా ఈ రిలయన్స్ కంపెనీలో ఉత్పత్తిని మొదలు పెట్టాలని ఆ సంస్థకు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కింది రానుంది.

రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,200 మందికి ఉపాధి లభిస్తుందని రిలయన్స్ తన డీపీఆర్‌లో అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలకు ఈనెల 19వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపింది. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఎపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్‌లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ప్లాంట్ కోసం ఎకరాకు రూ.30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లాంట్‌లో బాట్లింగ్ లైన్, వేర్‌హౌసింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఉంటాయని రిలయన్స్ సంస్థ పేర్కొంది.

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ఈ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలు సైతం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ చైర్మన్, ఎండీని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. రిలయన్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగాస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తాజా పెట్టుబడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirupati Tdp Leader House Robbery,టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు – robbery in tdp leader prakash rao house in tirupati district

27 June 2025

Rtc Passenger Slapped By Female Conductor,ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి చొక్కా పట్టుకుని కొట్టిన లేడీ కండక్టర్.. కారణం తెలిసి అవాక్కు – rtc passenger slapped by female conductor near vuyyuru krishna district

27 June 2025

Ap Govt Permission For Building One Rupee,ఏపీలో పేదలకు బంపరాఫర్.. వేలకు వేలు కట్టక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు.. త్వరపడండి – andhra pradesh government orders on relaxation of small buildings rules

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: 14 ఏళ్లకే టాప్ హీరోయిన్.. చిరంజీవితో 19.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్..

27 June 2025

అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆనతి కాలంలోనే…

Krishna District: చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!

27 June 2025

Tirupati Tdp Leader House Robbery,టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు – robbery in tdp leader prakash rao house in tirupati district

27 June 2025

Rtc Passenger Slapped By Female Conductor,ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి చొక్కా పట్టుకుని కొట్టిన లేడీ కండక్టర్.. కారణం తెలిసి అవాక్కు – rtc passenger slapped by female conductor near vuyyuru krishna district

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: 14 ఏళ్లకే టాప్ హీరోయిన్.. చిరంజీవితో 19.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్..

27 June 2025

Krishna District: చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!

27 June 2025

Tirupati Tdp Leader House Robbery,టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు – robbery in tdp leader prakash rao house in tirupati district

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.