దిన ఫలాలు (జూన్ 27, 2025): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కొనసాగే అవకాశముంది. వృషభ రాశి వారి ఆదాయ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కొనసాగుతుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, బాధ్యతలు మారే సూచనలున్నాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం ఉంటాయి. వృత్తి జీవితం చాలావరకు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.. మీ మాటకు విలువ పెరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలను ఆర్జిస్తారు. ఆస్తి వివాదాల్లో బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగు పడుతుంది. రుణగ్రస్తుల నుంచి డబ్బు వసూలు అవుతుంది. కొందరు మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం వల్ల ఇబ్బందిపడతారు. రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వ వద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. కొత్త బాధ్యతలతో ప్రోత్సహించడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రుణ సమస్యలను బాగా తగ్గించుకుంటారు. రావలసిన డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేస్తారు. గృహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చదువుల్లో పిల్లలు పురోగతి చెందుతారు. ఆరోగ్య బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. తలపెట్టిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన సొమ్ము కూడా కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ధనాదాయం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రులతో ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రతిఫలాలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా కొనసాగుతాయి. ఇరుగు పొరుగుతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆశాభంగాలు కలగవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వ్యక్తిగత ఖర్చులు బాగా పెరుగుతాయి. గృహ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.