పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి అనేక అంతు చిక్కని రహస్యాలు, నమ్మకాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రత్యేకమైన నమ్మకం ఒకటి పక్షులు లేదా విమానాలు దానిపై ఎగరవు. సరే విమానాలంటే మనుషుల కంట్రోల్‌లో ఉంటాయి కాబట్టి మనం అటుగా విమానం తీసుకెళ్తే వెళ్తాయి.. లేదంటే లేదు. కానీ, పక్షులు మన కంట్రోల్‌లో ఉండవు. అవి మనుషులు చెప్పినట్లు ఎగరవు. వారి ఇష్టమొచ్చినట్లు ఎగురుతూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లాయి. కానీ, పూరీ జగన్నాథ ఆలయం మీదుగా మాత్రం పక్షులు ఎగరవు అని అంటారు. దానికి మతపరమైన, శాస్త్రీయ నమ్మకాలు రెండూ ఉన్నాయి. ఇది భక్తులు, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే రహస్యం.