కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. కాస్ట్లీ కారులు, బ్రాడెడ్ బట్టలు, కోట్లు ఖరీదు చేసే ఇళ్లు , ఖరీదైన వాచ్ లు వాడుతుంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుండటంతో.. సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాంతో హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసేవారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు పెద్ద యుద్ధమే చేసేవారు.. అయితే ఆమె ఇప్పటి హీరోయిన్ కాదు ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన నటి ఆమె.. రోజుకు లక్ష రూపాయిలు రెమ్యునరేషన్ అందుకుంది. చివరకు అనాధల కన్నుమూసింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు
సిల్క్ స్మిత.. ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన అందాల సుందరి. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, డిస్కో శాంతి లాంటివారికి పోటినిచ్చి.. ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఛాన్స్‌లు సంపాదించింది ఈ భామ. ఆ సమయంలో ఓ స్టార్ హీరోయిన్‌కు మించిన క్రేజ్ సిల్క్ స్మితకు ఉందనడంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ అందుకునేది సిల్క్ స్మిత. ఎంతోమంది డ్యాన్సర్లు సిల్క్ స్మిత తర్వాత వచ్చారు.. అయినా ఎవ్వరూ కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్ను టచ్ చేయలేకపోయారు. ఇదంతా కూడా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. గతంలో డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి పలు సంచలన విషయాలు చెప్పింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?
‘సిల్క్ స్మిత చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఆమెను నేను అక్కా అని పిలిచేదాన్ని. పెళ్లి విషయం ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్ధం కాలేదు. సిల్క్ స్మిత ఏ విషయాలు నా దగ్గర దాచేది కాదు. ఆమె భర్త గురించి, అతడికి ముందే ఉన్న పిల్లల గురించి నాతో చెప్పింది. అప్పట్లో స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు లక్ష నుంచి రూ. 3 లక్షలు ఆమె రెమ్యునరేషన్‌గా తీసుకుంది. నెలకు ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది. మేము ఆ స్థాయికి చేరుకునేందుకు పదేళ్లు పట్టింది. అప్పుడప్పుడూ సొంత ఇల్లు కొనుకోవచ్చు కదా అని నేను అడిగేదాన్ని.? ఆమెది చాలా లగ్జరీ లైఫ్. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది. అవకాశాల కోసం తిరిగినప్పుడు.. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే డబ్బులపై పడుకుంటున్నాను అని చెప్పింది. సెట్లలో ప్రతీ ఒక్కరు ఆమెను గౌరవించేవారు’ అని డిస్కో శాంతి తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి