ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫహల్గం లోని దాడి చేసి మతం అడిగి మరీ 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. దీంతో ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సిందూర్‌తో ప్రతిస్పందించింది. దీంతో పాకిస్తాన్ లో ఇప్పుడు భారత దేశం పేరు వినిపిస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనే ఆలోచిస్తున్నారా.. ఇదిగో సమాధానం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ఒక విధంగా అగ్నికి ఆజ్యం పోసింది. ఒక బ్రిటిష్ కంటెంట్ సృష్టికర్త పాకిస్తాన్‌లోని లాహోర్ వీధుల్లో భారత క్రికెట్ జట్టు జెర్సీని ధరించి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో వైరల్ అయింది. అలెక్స్ వాండర్స్ అనే బ్రిటిష్ కంటెంట్ సృష్టికర్త తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దీనిని షేర్ చేశాడు. అతను టీమ్ ఇండియాకి సంబంధించిన నీలిరంగు డ్రీమ్ 11 జెర్సీని ధరించి లాహోర్ లోని స్థానికులతో కలిసి తిరుగుతున్నాడు.
ఈ వీడియోను 2.5 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోలో వాండర్స్ లాహోర్‌లోని వివిధ ప్రాంతాలలో తిరుగుతూ, నవ్వుతూ, కరచాలనం చేస్తూ, స్థానికులతో కబుర్లు చెబుతూ కనిపించాడు. అయితే అలెక్స్ వాండర్స్ భారతదేశ జెర్సీ ధరించి ఉండటంతో అతని వైపు వింతగా చూశారు. అయితే ఎక్కడా ఎవరూ అతనిపై దాడి చేసినట్లు కానీ లేదా వేధించిన సంఘటనలు జరగలేదు. ఈ వీడియోలో వాండర్స్ పాకిస్తాన్లో తనకు లభించిన స్వాగతం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో భారత దేశానికి సంబంధించిన చొక్కా ధరిస్తే.. ఏమీ జరగదని, ఎందుకంటే అక్కడి ప్రజలు నిజంగా మంచివారు అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
అతను షేర్ చేసిన వీడియోకు “పాకిస్తాన్లో భారత క్రికెట్ షర్ట్ ధరించడం సురక్షితమేనా?” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ ప్రశ్నను భారతీయ, పాకిస్తాన్ సోషల్ మీడియా వినియోగదారులు భారీ సంఖ్యలో వ్యాఖ్యానిస్తున్నారు. వైరల్ క్లిప్ హాస్యాస్పదంగా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారు. టీ-షర్టుపై ఏమి రాసి ఉందో సగం మందికి తెలియదని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు lol. పాకిస్తాన్లో నమస్తే చేయడం మంచి పని అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యక్తి ఇంగ్లీష్ కారణంగా పాకిస్తాన్లో నివసిస్తున్నాడు. కనుక అతను ధరించిన ఈ టీ-షర్టుపై ఇండియా అనే పదాన్ని ఇంగ్లీషులో రాశాడు. పాకిస్తాన్‌లోని ప్రజలు ఇంగ్లీష్ చదవరని అందుకే అతను సురక్షితం అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..