ఈ ఏడాదిలోనే బ్లాక్ బస్టర్ హిట్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఒక థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెట్టింపు వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ కాగానే ఆ మూవీ టాప్ ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించి నంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. అదే రైడ్ 2. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా నటించి మెప్పించారు. అంతేకాకుండా వాణి కపూర్, అమిత్ సియాల్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్, రజత్ కపూర్, అనేక ఇతర తారలు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమా కథ ఆదాయపు పన్ను అధికారి అమయ్ పట్నాయక్ చుట్టూ తిరుగుతుంది. నిజాయితీపరుడైన అమయ్ ఎవరికీ భయపడడు. సిసినిమా ప్రారంభంలో ఒక దాడి నిర్వహించిన తర్వాత అమయ్ పై రూ. 2 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో అతడిని బదిలీ చేస్తారు అధికారులు. ఆ తరువాతే సినిమా అసలు కథ ప్రారంభమవుతుంది. అమయ్ పట్నాయక్‌ను కేబినెట్ మంత్రి మనోహర్ ధంకర్ అలియాస్ దాదాభాయ్ (రితేష్ దేశ్‌ముఖ్) పాలించే ప్రాంతానికి బదిలీ చేస్తారు. దాదాభాయ్ ఖచ్చితంగా కోట్ల విలువైన నల్లధనాన్ని దాచిపెట్టాడని అమయ్ అనుమానిస్తాడు. అమయ్ పట్నాయక్ దాదాభాయ్ కు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడం ప్రారంభిస్తాడు. ఆ తరువాత అమయ్ పట్నాయక్, దాదాభాయ్ మధ్య నిజమైన ఆట ప్రారంభమవుతుంది. క్లైమాక్స్‌లో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. మీరు ఊహించలేరు.
ఈ చిత్రం జూన్ 26న ఓటీటీలో విడుదలై కొన్ని గంటల్లోనే టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం, ‘రైడ్ 2’ చిత్రం దేశంలో నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. రూ. 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం మన దేశంలో రూ. 176.93 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ‘రెడ్ 2’ సినిమా మొత్తం వసూళ్లు రూ. 241.68 కోట్లు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..