ఇంటిలో కూర్చుని టీవీలో కార్యక్రమాలు చూస్తూ సినిమా థియేటర్ లో ఉన్న అనుభూతి పొందాలనుకునే వారికి లైమ్ బెర్రీ 43 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ కరెక్టుగా సరిపోతుంది. క్రిస్టల్ క్లియర్ సౌండ్ తో ఆడియో వినసొంపుగా ఉంటుంది. బెజెల్ లెస్ ఫార్మాట్, అల్ట్రా బ్రైట్ టెక్నాలజీ, డాల్బీ ఆడియో 24 వాట్స్ ఐఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, హెచ్ డీ ఏప్లస్ గ్రేడ్ ఎల్ఈడీ ప్యానెల్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ కంట్రోల్ తో ఓటీటీ యాప్ లు, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, యూట్యూబ్ కు మద్దతు ఇస్తుంది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజీ, ఐ సేఫ్ మోడ్, స్క్రీన్ మిర్రరింగ్, హెచ్ డీఎంసీ ఈఏఆర్సీ కనెక్టివిటీ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.14,499కు ఈ టీవీ అందుబాటులో ఉంది.
కంటెంట్ కు అనుగుణంగా స్పష్టమైన విజువల్, చక్కని ఆడియో విడుదల చేస్తూ ఇంటిలోని వారందరికి వినోదం అందించడం స్కైవాల్ 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ప్రత్యేకత. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో తదితర స్ట్రీమింగ్ యాప్ లకు మద్దతు ఇస్తుంది. మల్టీ హెచ్ డీఆర్ డిస్ ప్లే, అడాప్టివ్ బ్యాక్ లైట్ డిమ్మింగ్, 30 వాట్స్ డాల్బీ ఆట్మోస్ స్పీకర్ సిస్టమ్, అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్, వాయిస్ అసిస్టెంట్ రిమోట్, రెండు హెచ్ డీ ఎంఐ, యూఎస్ బీ పోర్టులు ఏర్పాటు చేశారు. చిన్న గదులకు ఈ టీవీ చక్కగా సరిపోతుంది. అమెజాన్ లో రూ.12,999కు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
స్లైల్, స్పీడ్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి వీడబ్ల్యూ 43 అంగుళాల ప్లేవాల్ ఫ్రేమ్ లెస్ సిరీస్ ఫుల్ హెచ్ డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ చక్కని ఎంపిక. 43 అంగుళాల స్క్రీన్ సైజు, పూర్తి హెచ్ డీ రిజల్యూషన్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ తో పనితీరు చాలా బాగుంటుంది. ఈటీవీ, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, హాట్ స్టార్, జీ5, స్మార్ట్ రిమోట్ వన్ క్లిక్ ఓటీటీ బటన్ తదితర యాప్ లకు మద్దతు ఇస్తుంది. ఐపీఈ ఫ్రేమ్ ప్యానెల్, ఎకో విజన్ ఫీచర్, 24 వాట్స్ స్పీకర్లు, వివిధ పోర్టులు ఆకట్టుకుంటున్నాయి. ఈ టీవీని అమెజాన్ లో రూ.13,999కి కొనుగోలు చేయవచ్చు.
ఆధునిక టెక్నాలజీ, తక్కువ ధరతో వీడబ్ల్యూ 43 అంగుళాల లైనక్స్ ఫ్రేమ్ లెస్ సిరీస్ ఫుల్ హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అందుబాటులోకి వచ్చింది. ఫుల్ హెచ్ డీస్ ప్లే, గదిలో ఏ మూలనుంచైనా విజువల్ ను స్పష్టంగా చూపించే ఏప్లస్ గ్రేడ్ ప్యానల్ బాగున్నాయి. యూట్యూబ్, ప్రైమ్ టీవీ, హాట్ స్టార్, జీ5 తదితర యాప్ లకు మద్దతు ఇచ్చే లైనక్స్ ఆధారిత కూలిటా 3.0 ప్లాట్ ఫాం, స్మార్ట్ ఫోన్ లోని కంటెంట్ ను టీవీలో చూపించే మిరాకాస్ట్, 24 వాట్స్ స్టీరియో బాక్స్ స్పీకర్ , ఫ్రేమ్ లెస్ జెజెల్, హెచ్ డీఎంఐ, యూఎస్ బీ, లాన్ పోర్టులు ఏర్పాటు చేశారు. ఈ టీవీని అమెజాన్ లో రూ.13,799కు కొనుగోలు చేయవచ్చు.
వీడబ్ల్యూ నుంచి విడుదలైన మరో 43 అంగుళాల ప్లేవాల్ ఫ్రేమ్ లెస్ ఫుల్ ఎల్ ఈడీ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అతి సన్నని ఆకారంలో ఈ టీవీ సైజు చాలా చిన్నదిగా కనిపించినా, పనితీరు చాలా బాగుంటుంది. దీనిలోని హెచ్ డీఆర్10, ఐపీఈ టెక్నాలజీ, ఏప్లస్ గ్రేట్ ప్యానల్ తో విజవల్ చాలా స్పష్టంగా చూడవచ్చు. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, డీస్నీ ప్లస్ హాట్ స్టార్ తదితర యాప్ లకు మద్దతు ఇస్తుంది. 24 వాట్స్ బాక్స్ స్పీకర్లు, 5 సౌండ్ మోడ్ లతో అన్ని కార్యక్రమాలను చక్కగా వీక్షించవచ్చు. కనెక్టివిటీ కోసం 2 హెచ్ డీఎంఐ, 2 యూఎస్ బీ, ఈథర్నెట్, ఆఫ్టికల్ పోర్టులు ఏర్పాటు చేశారు.