Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tholi Ekadashi 2025: ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు.. 5నా? జూలై 6నా? పూజా విధి, శుభ సమయం ఎప్పుడంటే..

30 June 2025

అయ్యో ఘోరం.. బంగారం గని కూలి 11 మంది చిన్నారులు మృతి.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోంది..

30 June 2025

Andhra Pradesh Property Tax Payments In Whatsapp,ఏపీ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, వాట్సాప్‌తో చాలా ఈజీగా – andhra pradesh people can pay property tax through whatsapp

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Car Fire Accident,తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు.. – fire breaks out in car at gnc toll gate in tirumala
ఆంధ్రప్రదేశ్

Tirumala Car Fire Accident,తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు.. – fire breaks out in car at gnc toll gate in tirumala

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Car Fire Accident,తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు.. – fire breaks out in car at gnc toll gate in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమలలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి జీఎన్ఎస్ టోల్ గేట్ దగ్గర జరిగిన ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే అదృశ్టవశాత్తూ కారులో ఉన్న ప్రయాణికుడు క్షేమంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు..
తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు.. (ఫోటోలు– Samayam Telugu)

తిరుమలలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలలోని GNC టోల్ గేట్ దగ్గర ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బెంగళూరులోని ముళబాగిలుకు చెందిన సుదర్శన్ అనే భక్తుడు కారులో తిరుమలకు వచ్చారు. టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి కారులో మంటలు రావడం మొదలైంది. ఈ విషయం గమనించిన భక్తుడు.. వెంటనే కారులో నుంచి బయటకు వచ్చి క్షేమంగా బయటపడ్డారు.

అయితే సాంకేతిక లోపం వల్లనే కారులో మంటలు చెలరేగి ఉంటాయని అనుకుంటున్నారు. TTD భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తున్నారు. “సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

మరోవైపు శుక్రవారం రోజు కూడా తిరుమలలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓ కారు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ముందున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో భక్తులు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. అదే సమయంలో తెలంగాణ నుంచి కూడా కొంతమంది భక్తులు మరో కారులో తిరుమలకు వచ్చారు.

అయితే మొదటి ఘాట్‌ రోడ్డులోని రెండో మలుపు వద్ద తమిళనాడు భక్తులు ప్రయాణిస్తు్న్న కారు అదుపు తప్పి ముందున్న తెలంగాణ భక్తులు ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలోకి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో టీటీడీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని.. ఘాట్ రోడ్డులోని వాహనాలను పక్కకు తొలగించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి