Adoni Missing Boy Returns After 32 Years: 32 ఏళ్ల క్రితం తప్పిపోయిన వీరేష్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. మూడు సంవత్సరాల వయస్సులో రైలు ఎక్కి చెన్నై చేరుకున్నానని, ఆ తర్వాత ముంబైలో పెరిగానని తెలిపాడు. ఆదోనిలోని తన కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుపమని సబ్ కలెక్టర్‌ను వేడుకున్నాడు. హిందీ, మరాఠీ భాషలు మాత్రమే మాట్లాడే వీరేష్‌కు తెలుగు రాదు. అధికారులు అతడి కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.
హైలైట్:
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఘటన
- మూడేళ్ల వయసులో వెళ్లిపోయాడు
- 32 ఏళ్ల వయసులో తిరిగొచ్చాడు
- ఫ్యామిలీ కోసం వెతుకుతూ..

తాను తన కుటుంబసభ్యుల ఎక్కడున్నారో ఆచూకీ కోసం వెతుకుతున్నానని.. సాయం చేయమని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి కోరానన్నారు. సబ్ కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి.. తన కుటుంబసభ్యుల అడ్రస్ వెతికిపెట్టాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించినట్లు వీరేష్ చెబుతున్నారు. వీరేష్‌కు హిందీ, మరాఠి భాషలు మాత్రమే వచ్చు.. తెలుగు రాదు. అధికారులు ఎలాగైనా తన ఫ్యామిలీ ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నారు.
ఎప్పుడో మూడేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరేష్‌కు ఇప్పుడు కుటుంబసభ్యులు గుర్తుకురావడం ఆశ్చర్యమనే చెప్పాలి. ఊరు, తల్లిదండ్రులు, నాన్నమ్మ గురించి చెబుతున్నా.. మిగిలిన విషయాలేవీ తెలియదంటున్నారు. మరి అతడికి కుటుంబసభ్యుల వివరాలు తెలుస్తాయా.. మళ్లీ వారికి దగ్గరవుడతాాడా లేదా అన్నది చూడాలి మరి.