Andhra Pradesh Weather Updates: వాతావరణ శాఖ హెచ్చరిక! ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉండవచ్చు. మరి ఈ వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి!
హైలైట్:
- బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం
- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
- ప్రజల్ని అలర్ట్ చేసిన వాతావరణశాఖ

Saraswati Sugar Mill: కొంపముంచిన వర్షం.. కరిగిపోయిన కోట్ల విలువైన చక్కెర!
‘రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో 10 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 9 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కుకునూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, వైఎస్సార్ కడప, నంద్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. ఇది బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం. ఈ వర్షాలు సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందంటోంది ప్రభుత్వం.