Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పాయల్ రాజ్ పుత్ సైలెంట్ అయ్యిందే.. ఆఫర్స్ రావడం లేదా..? గ్యాప్ తీసుకుందా..?

3 July 2025

Hari Hara Veera Mallu: సిల్వర్ స్క్రీన్‌పై కల్యాణ్‌ బాబు ఫైర్‌.. హరి హర వీరమల్లు ట్రైలర్‌పై చిరు, రామ్ చరణ్

3 July 2025

అను ఇమ్మాన్యుయేల్ గుర్తుందా.? సినిమాలు లేవు కానీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Govt Employees Free Accommodation Extended 2026,ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. మొత్తం ఉచితంగానే, రూపాయి కట్టక్కర్లేదు – andhra pradesh government orders on extending free accommodation facility for employees for another year
ఆంధ్రప్రదేశ్

AP Govt Employees Free Accommodation Extended 2026,ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. మొత్తం ఉచితంగానే, రూపాయి కట్టక్కర్లేదు – andhra pradesh government orders on extending free accommodation facility for employees for another year

.By .3 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Govt Employees Free Accommodation Extended 2026,ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. మొత్తం ఉచితంగానే, రూపాయి కట్టక్కర్లేదు – andhra pradesh government orders on extending free accommodation facility for employees for another year
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Employees Free Accommodation Extended: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత బస సౌకర్యాన్ని మరో ఏడాది పొడిగించింది. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ స్పోక్‌ సెంటర్ల ఏర్పాటుకు జిల్లాల జేసీలను ప్రభుత్వం నామినేట్ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల కోసం సంసిద్ధత కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కు భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాల ద్వారా ఉద్యోగులకు, విద్యార్థులకు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.

ఏపీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత బస సదుపాయం
ఏపీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత బస సదుపాయం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టులో పని చేస్తున్న ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. మరో ఏడాది షేరింగ్‌ ప్రాతిపదికన ఉచిత బస సౌకర్యాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులు.. అమరావతికి వచ్చారు. అయితే విభజన సమయంలో హైదరాబాద్‌‌లో ఉండటంతో.. వారి పిల్లల చదువులు వంటి కారణంగా కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచారు. అయతే అమరావతిలో ఒంటరిగా ఉంటున్న ఉద్యోగుల గురించి ఆలోచించిన ప్రభుత్వం.. వారి సౌలభ్యం కోసం గత 11 ఏళ్లుగా అపార్ట్‌మెంట్‌లను అద్దె ప్రాతిపదికన తీసుకుని ఉచిత బస సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉచిత బస సౌకర్యం గడువు జూన్‌ 27తో ముగిసింది.. తాజాగా మరోసారి ఉచిత బస సౌకర్యాన్ని 2026 జూన్‌ 26 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌) స్పోక్‌ సెంటర్లకు సంబంధించి.. ఏపీ ప్రభుత్వం తరఫున నామినీ అధికారుల్ని నామినేట్ చేశారు. ఈ మేరకు ఆయా సంబంధిత జిల్లాల జేసీలను నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గుంటూరు జిల్లా జేసీ అమరావతిలో ఏర్పాటు చేసే మెయిన్ హబ్‌కు నామినేటెడ్‌ అధికారిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న హబ్‌లు.. ప్రధాన హబ్‌కు అనుసంధానంగా పనిచేస్తాయి అన్నారు. ఈ మేరకు జేసీలు భాగస్వామ్య పక్షాలను సమన్వయం చేస్తారని ప్రభుత్వం తెలియజేసింది. ఈ హబ్‌లకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటుగా నిర్వహణను జేసీలు పర్యవేక్షించనున్నారు.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో సంసిద్ధత (రెడీనెస్‌) కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. చదివే 1 నుంచి 6 తరగతుల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లాస్ మారడం, ఫౌండేషన్‌ లెవల్ నుంచి విద్య నేర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘ ఒకటి, రెండు తరగతులకు 45, మూడు నుంచి ఐదు తరగతులకు 30, ఆరో తరగతి విద్యార్థులకు 40 రోజుల పాటు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్‌ను బోధన. ఒకటి, రెండు తరగతులకు తెలుగు, గణితం, ఆంగ్లంతోపాటు రంగులు గుర్తించడం, శబ్దాలు విని స్పందించడం లాంటివి.. 3 నుంచి 6 తరగతులకు తెలుగు, గణితం, ఆంగ్లం, ఈవీఎస్‌ను బోధిస్తారు’ అని తెలిపారు అధికారులు.

ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు భూమిని కేటాయించారు. నగరంలోని మధురవాడలో 22.19 ఎకరాలను.. 99 పైసలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2028 జూన్‌ కల్లా మొదటి దశ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు కాగ్నిజెంట్ అంగీకరించింది. ‘2026 జూన్‌ నాటికి లీజు విధానంలో ఏర్పాటు చేసే క్యాంపస్‌లో 500 మందికి ఉపాధి కల్పిస్తారు. ఏపీ ఐటీ పాలసీ 4.0 నిబంధనల మేరకు ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. విశాఖలో రూ.1,582.98 కోట్ల పెట్టుబడి పెట్టి… 8 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కాగ్నిజెంట్‌ సుముఖత వ్యక్తంచేసింది’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి