లేడీ సూపర్ స్టార్ నయనతార.. దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సౌత్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో కనిపించింది. ఆనతి కాలంలోనే స్టార్ హీరోల జోడిగా నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. షారుఖ్, అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాతో అటు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నయన్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. అయినప్పటికీ హిందీలో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టీమ్ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే.. తన కెరీర్ లో ఓ సినిమాలో నటించినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయన్. అందులో తనను ఎంతో చెత్తగా చూపించారని తెలిపింది. ఆ సినిమానే గజినీ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన గజిని చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా ఆసిన్ నటించగా.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇందులో చిత్ర అనే మెడికల్ స్టూడెంట్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది నయన్. అయితే తాను ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటీలో గజినీ చిత్రంలో నటించినందుకు బాధపడుతున్నానని.. ఈ సినిమాను ఎంపిక చేసుకోవడమే చెత్త నిర్ణయమని తెలిపింది. అందులో తన పాత్రను తనకు చెప్పినట్లుగా చిత్రీకరించలేదని.. తనను చెత్తగా ఫోటోస్ తీశారంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని.. దానిని మాత్రం ఒక పాఠంగా నేర్చుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం నయన్ చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. చివరగా అన్నపురణి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది నయన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. ప్రస్తుతం చిరు సినిమాతోపాటు తమిళంలో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..