యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతోపాటు మరిన్ని చిత్రాలు సైతం అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే డార్లింగ్ సరసన నటించాలని ఎంతమంది హీరోయిన్స్ కోరుకుంటారు. కానీ ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయానంటుంది ఈ హీరోయిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నిత్యా మీనన్. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం కథానాయికగానే కాకుండా సింగర్ గానూ రాణిస్తుంది. పాత్ర నచ్చితే చాలు నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తూ మెప్పిస్తుంది. తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ అమ్మడు.. ఇప్పుడు తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే కెరీర్ తొలినాళ్లల్లో ప్రభాస్ గురించి తాను చేసిన కామెంట్స్ తనను మానసికంగా బాధించాయని చెప్పుకొచ్చింది.
ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు అంతగా చూడలేదు. అప్పుడు నాకు తెలుగు సరిగా రాకపోవడంతో సినిమాలు చూడలేదు. కానీ కెరీర్ మొదట్లో ప్రభాస్ గురించి నన్ను అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. దీంతో నేనేదో తప్పు చేసినట్లుగా చూశారు. నాపై విమర్శలు చేశారు. అలా చెప్పడంతో చాలా హర్ట్ అయ్యాను. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్లు ఉండకూడదని .. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలని తెలిసింది. ఇప్పటికీ ఆ ఇష్యూ నన్ను బాధపెడుతుంది” అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిత్య మీనన్.
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..