Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra: ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా

3 July 2025

Deepika Padukone: దీపిక పదుకోన్‌ అరుదైన రికార్డు.. ఫస్ట్ ఇండియన్‌ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్‌ చేసిన ముద్దుగుమ్మ

3 July 2025

Ramayana: గూస్ బంప్స్ తెప్పిస్తున్న రామాయణ.. మూడు నిమిషాల లోనే మోత మోగించారు

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh Sorry On Road,’నాకు తెలుసు కానీ’.. ఆ ఊరి ప్రజలకు క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్ – minister nara lokesh says sorry to common man and villagers on road
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Sorry On Road,’నాకు తెలుసు కానీ’.. ఆ ఊరి ప్రజలకు క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్ – minister nara lokesh says sorry to common man and villagers on road

.By .3 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh Sorry On Road,’నాకు తెలుసు కానీ’.. ఆ ఊరి ప్రజలకు క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్ – minister nara lokesh says sorry to common man and villagers on road
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nara Lokesh Sorry On Village Road: మంత్రి నారా లోకేష్ ప్రజల సమస్యలపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు ఆయన స్పందించారు. ఎన్టీఆర్ జిల్లాలోని వెల్వడం గ్రామస్తులు రోడ్డు సమస్యపై నిరసన తెలుపగా, లోకేష్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పారు. రోడ్డు బాగాలేకపోవడం వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలిని సత్కరించారు.

హైలైట్:

  • ఆ ఊరి జనాలకు సారీ చెప్పిన నారా లోకేష్
  • యువకుడు ట్వీట్ చూసి క్షమాపణలు చెప్పారు
  • వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు
క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్
క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్ (ఫోటోలు– Samayam Telugu)

ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. ఎవరైనా తమ సమస్యను చెప్పుకుని ట్వీట్ చేస్తే చాలు వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు వైద్యం కోసం, మరికొందరు ఆర్థిక పరిస్థితి సరిగా లేనివారు, ఇంకొదరు నీళ్ల సమస్యలు, అలాగే రోడ్ల సరిగా లేవంటూ వారి, వారి సమస్యల్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని వెల్వడం అనే ఊరి సమస్యను ఓ యువకుడు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.. ఈ విషయం తెలిసిన వెంటనే నారా లోకేష్ ట్వీట్ చేసిన వ్యక్తికి, ఆ ఊరి జనాలకు క్షమాపణలు చెప్పారు.. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని వెల్వడంలో ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు సోమవారం ప్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించి గ్రావెల్ పోసి వదిలేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సమస్య వల్ల విద్యార్థులు కూలీలు ప్రయాణికులు వాహనదారులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి లోకేష్ ఈ సమస్య పరిష్కరించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు’ అంటూ ఆ యువకుడు ట్వీట్ చేశారు.

స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో.. ‘లోకేష్ అన్న మా ఊరి సమస్యని దయ ఉంచి పరిష్కరించండి.. ప్రస్తుతం గ్రాంలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. 10 ఏళ్ల క్రితం వెల్వడం గ్రామంలో కొన్ని సర్వే నంబర్లు నోటిఫై చేయకుండా కొన్ని సర్వే నంబర్లు మాత్రమే నోటిఫై చేసి రోడ్డు నిర్మాణం చేయడం వల్ల ఇరుకు, ట్రాఫిక్ రోడ్డుతో సంవత్సరాలుగా అధికారులుఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మళ్లీ 4 నెలల క్రితం తారు రోడ్డు తొలగించి.. గ్రావెల్ పోసి రోడ్డు పనిని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ సమస్య వల్ల స్కూల్ విద్యార్థులకు, కూలీలకు, ప్రయాణికులకు, వాహనదారులకు, అన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఆరోగ్య, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కావున నోటిఫై చేయని సర్వే నంబర్లు నోటిఫై చేసి గుంతలమయంగా మారిన రోడ్డును నిర్మాణం చేసి వెల్వడం గ్రామ సమస్యను, ప్రయాణికుల సమస్యను త్వరగా పరిష్కరించగలరని ప్రార్థిస్తున్నాము’ అన్నారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేష్.. ‘రోడ్డు బాగాలేకపోవడం వల్ల వెల్వడం గ్రామ ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాను. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించారు.. దాని స్థానంలో కంకర రోడ్డు వేశారు. దీని వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం నాకు తెలుసు. స్థానిక MLA వసంత కృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడతాను. అధికారులతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా రోడ్డును త్వరగా బాగు చేయిస్తాను’ అన్నారు.

సామాన్యుడికి మంత్రి క్షమాపణ.. కారణం ఏంటంటే?

అలాగే ‘కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తిపట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం.కల్యాణి కుమారి గారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసంలో కలిశాను. ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించాను. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామని ఈ సందర్భంగా వివరించాను. కల్యాణి గారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాను’ అని మరో ట్వీట్ చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి