Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

13 July 2025

Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nats Rs 85 Lakh To Basavatarakam Cancer Hospital,బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భారీ విరాళం.. బాలకృష్ణకు చెక్కు అందజేత, ఎంతంటే.. ఆ ఊరి వాళ్లకు ఉచితంగా వైద్యం – nats donated rs 85 lakh to basavatarakam indo american cancer hospital
ఆంధ్రప్రదేశ్

Nats Rs 85 Lakh To Basavatarakam Cancer Hospital,బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భారీ విరాళం.. బాలకృష్ణకు చెక్కు అందజేత, ఎంతంటే.. ఆ ఊరి వాళ్లకు ఉచితంగా వైద్యం – nats donated rs 85 lakh to basavatarakam indo american cancer hospital

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nats Rs 85 Lakh To Basavatarakam Cancer Hospital,బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భారీ విరాళం.. బాలకృష్ణకు చెక్కు అందజేత, ఎంతంటే.. ఆ ఊరి వాళ్లకు ఉచితంగా వైద్యం – nats donated rs 85 lakh to basavatarakam indo american cancer hospital
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Basavatarakam Cancer Hospital Rs 85 Lakh Donation: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.85 లక్షల విరాళం అందజేసింది. ఫ్లోరిడాలో జరిగిన తెలుగు సంబరాల్లో ఈ విరాళాన్ని నందమూరి బాలకృష్ణకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ బాధితుల కోసం బసవతారకం ఆసుపత్రి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చొరవతో, నారా బ్రాహ్మణి స్పందించి ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు.

హైలైట్:

  • బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భారీ విరాళం
  • చెక్కును బాలయ్యకు ఇచ్చి నాట్స్ సభ్యులు
  • బలభద్రపురానికి అండగా నిలిచిన ఆస్పత్రి
బసవతారకం ఆసుపత్రికి నాట్స్‌ విరాళం
బసవతారకం ఆసుపత్రికి నాట్స్‌ విరాళం (ఫోటోలు– Samayam Telugu)

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం ఇచ్చింది. నాట్స్ అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించిన 8వ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ సంబరాల ముగింపులో బసవతారకం ఆసుపత్రికి రూ.85 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ఛైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ, నాట్స్‌ సభ్యులు ఈ విరాళం చెక్కును బాలకృష్ణకు అందజేశారు. ఎన్టీఆర్ గ్లోబల్ లిటరేచర్ కమిటీ రూపొందించిన ‘శక పురుషుడు’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ నుంచి జయసుధ, మీనా, శ్రీలీల వంటి సినీ నటులను సత్కరించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, సీనియర్ హీరో వెంకటేశ్, ఏపీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, గౌతు శిరీష, వసంత కృష్ణప్రసాద్, చదలవాడ అరవిందబాబులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.మరోవైపు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ బాధితులకు బసవతారకం ఆస్పత్రి అండగా నిలిచింది. గ్రామంలో కేసులు బయటపడటంతో బసవతారకం ఆసుపత్రి వైద్యులు గ్రామాన్ని సందర్శించి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బసవతారకం ఆస్పత్రి డాక్టర్ల కృష్ణప్రసాద్, సునీల్ టాండన్ బలభద్రపురం వెళ్లి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడారు. బలభద్రపురం సమస్య గురించి తాను అసెంబ్లీలో ప్రస్తావించానని.. ఆ వెంటనే ప్రభుత్వం సర్వే చేయించింది అన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్ల. 1,298 మందికి పరీక్షలు చేస్తే 67 మందికి పాజిటివ్‌గా అనుమానిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఈ క్యాన్సర్ కేసుల అంశం సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణికి తెలిసి ఆమె స్వయంగా బసవతారకం ఆస్పత్రి సీఈవో కృష్ణయ్యతో మాట్లాడారన్నారు. ఆ వెంటనే సీఈవో ఇద్దరు డాక్టర్లను పంపారని.. ఊరిలో అందరికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు.. ఒకవేళ ఎవరికైనా వ్యాధి ఉంటే బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తారని తెలిపారు. అలాగే ఆరోగ్యవంతమైన బలభద్రపురాన్ని చూడటమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి. క్యాన్సర్ సాధారణంగా మూడు, నాలుగు దశలకు వచ్చే వరకు తెలియదన్నారు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ కృష్ణప్రసాద్. అప్పుడు చికిత్స చేసినా ఫలితం ఉండదన్నారు.

Nandamuri Balakrishna: హిందీలో అదరగొట్టిన బాలయ్య

బలభద్రపురం ప్రజల ఆరోగ్యానికి బసవతారకం ఆసుపత్రి సహాయం చేయడానికి ముందుకు రావడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఇటీవల బలభద్రపురంలో పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య పర్యటించారు.. పరిశ్రమలపై ఆరా తీశారు. బలభద్రంపురంలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది.. ఊరిలో ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కూడా అండగా నిలిచింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి