Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అలాంటి రోల్స్ అస్సలు చేయను.. 50 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న హీరోయిన్.. జోరు ఇప్పుట్లో ఆగేలా లేదుగా..

13 July 2025

జస్ట్.. లక్ష పెట్టుబడితో చేతికి రూ. 2 లక్షలు.. లాభాలకే మెంటలెక్కించే స్కీమ్ భయ్యా..

13 July 2025

ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Cabinet Decisions,ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! – ap cabinet decides to release pending paddy procurement dues to farmers
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Cabinet Decisions,ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! – ap cabinet decides to release pending paddy procurement dues to farmers

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Cabinet Decisions,ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! – ap cabinet decides to release pending paddy procurement dues to farmers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Funds Release to Farmers: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ క్రమంలోనే రైతులకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్ వినిపించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బకాయిల డబ్బులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ధాన్యం పాత బకాయిలు రూ. వేయికోట్లు ఉండగా.. అందులో రూ. 672 కోట్ల నిధులు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (ఫోటోలు– Samayam Telugu)

బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ.672 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ డబ్బును 24 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఈ బాధ్యతను అప్పగించారు.

ప్రజా పంపిణీ కోసం ప్రభుత్వం గత రబీ సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. అయితే, మద్దతు ధరను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రైతుల సమస్యను పరిష్కరించడానికి, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) నుంచి ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం జూలై 4న అనుమతి ఇచ్చింది. ఈ రుణం రాగానే, ధాన్యం బకాయి డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది.

మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై స్పందిస్తూ, “రైతులకు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.672 కోట్లు విడుదలకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు” తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 32 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. “24 గంటల్లో రైతుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలు జమ చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఈ నిర్ణయం రైతులకి ఎంతో ఊరటనిస్తుంది. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

మరోవైపు ఏపీ కేబినేెట్ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్టుబుడులు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని.. కంపెనీలకు మెయిళ్లు పెట్టారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి