Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Students Parents Teachers Meet Guinness Record,ఏపీ వేదికగా గిన్నీస్ బుక్ రికార్డ్.. ఏకంగా 2.28 కోట్ల మందితో, పూర్తి వివరాలివే – andhra government aims for guinness record with parent teacher mega meeting
ఆంధ్రప్రదేశ్

Ap Students Parents Teachers Meet Guinness Record,ఏపీ వేదికగా గిన్నీస్ బుక్ రికార్డ్.. ఏకంగా 2.28 కోట్ల మందితో, పూర్తి వివరాలివే – andhra government aims for guinness record with parent teacher mega meeting

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Students Parents Teachers Meet Guinness Record,ఏపీ వేదికగా గిన్నీస్ బుక్ రికార్డ్.. ఏకంగా 2.28 కోట్ల మందితో, పూర్తి వివరాలివే – andhra government aims for guinness record with parent teacher mega meeting
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Parents Teachers Mega Meeting Guinness Book Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది! ఒకే రోజు రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భారీ సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతకీ ఈ సమావేశంలో ఏం జరగబోతోంది? విద్యార్థుల భవితవ్యం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? గిన్నిస్ రికార్డు ఎలా సాధ్యమవుతుంది?

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు దిశగా అడుగులు
  • ఒకే రోజు ఏకంగా 2 కోట్ల మందితో మెగా ఈవెంట్
  • హాజరుకానున్న చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ టీచర్ల సమావేశం
ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ టీచర్ల సమావేశం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. ఒకే రోజు రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భారీ సమావేశం (మెగా PTM-2.0) నిర్వహించనున్నారు. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు అందరూ ఒకే చోట కలుస్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 2.28 కోట్ల మంది పాల్గొననున్నారు.. ఇది గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కనుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఒక గొప్ప ఆలోచనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భారీ సమావేశం జరుగుతోంది. అందరినీ ఒకే చోటకు చేర్చాలనే ఉద్దేశం, సంకల్పంతో సరికొత్త ఆలోచన చేశారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీల సభ్యులు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మెగా PTM-2.0లో దాదాపు 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు పాల్గొంటారు. దాతలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. మొత్తం మీద 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సాధించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటుతారు. మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్‌పోర్టులు ఇవ్వనున్నారు.

గతేడాది తొలిసారిగా నిర్వహించిన మెగా పీటీఎం విజయవంతం అయ్యింది.. దీంతో ఈ ఏడాది పటీఎం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇకపై ప్రతి ఏటా పండుగ వాతావరణంలో మెగా పీటీఎంలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పిల్లలకు సంబందించి ప్రోగ్రెస్‌ కార్డుల్ని కూడా తల్లిదండ్రులకు అందజేస్తారు. అలాగే ప్రధానంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించనుంది.

ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభంకానుంది. ‘విద్యార్థుల సంక్షేమం, అభ్యసనా సామర్థ్యాల పెంపు, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు, పొందుతున్న లబ్ధి తదితర అంశాలపై సమీక్ష.మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్‌ క్రైం, సోషల్‌ మీడియా అంశాలపై అవగాహన కల్పించడం. ఆటల పోటీలు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సమావేశం. అమ్మపేరుపై మొక్కనాటడం (4నుంచి టెన్త్‌ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం) వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు’ అని తెలిపారు.

డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఒక్కమాటలో తేల్చేసిన నారా లోకేష్

‘గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఉదయం పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన కొత్తచెరువులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడినుంచి పక్కనే ఉన్న జడ్పీ హైస్కూల్‌కు వెళ్తారు. అక్కడ మెగా పీటీఎం అనంతరం చంద్రబాబు పుట్టపర్తి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి విమానాశ్రయం చేరుకుని విజయవాడకు బయలుదేరి వెళ్తారు’అని సీఎం షెడ్యూల్ ప్రకటించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి