Andhra Pradesh New Airports Hudco Loan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి, కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి విమానాశ్రయాల అభివృద్ధి కోసం హడ్కో నుండి రూ.1,000 కోట్ల రుణం తీసుకోనుంది. ఒంగోలు, నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీకి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో విమాన తయారీ సంస్థ ఏర్పాటుకు సరళ ఏవియేషన్ ప్రతిపాదనలు చేసింది.
హైలైట్:
- ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు
- అమరావతి, కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి
- హడ్కో నుంచి రూ.1,000 కోట్ల రుణం

సీఎం కారులో.. సీఎంతో కలిసి.. దళితుడి ప్రయాణం
ఎయిర్ టాక్సీల తయారీ సంస్థ సరళ ఏవియేషన్, డేటా సెంటర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ సంస్థ, గోల్డెన్ ఎపలెట్స్ ఏవియేషన్ అకాడమీ, హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సరళ ఏవియేషన్ సంస్థ ఎయిర్ టాక్సీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. కంట్రోల్ ఎస్ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉంది. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. రాడార్, GPS పరికరాలు, నేవిగేషన్ వ్యవస్థలు తయారు చేసే హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది.