Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Stay Sharp: వయసుతో పనిలేదు.. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది..

12 July 2025

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్ 2025.. మొబైల్ నంబర్, అడ్రస్, స్పెల్లింగ్ మార్చండిలా!

12 July 2025

KL Rahul : లార్ట్స్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Garividi Veterinary College Good News,ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఆ విద్యార్థలందరికి పండగే, ఆ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది – union government good news for veterinary college students in garividi vizianagaram district
ఆంధ్రప్రదేశ్

Garividi Veterinary College Good News,ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఆ విద్యార్థలందరికి పండగే, ఆ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది – union government good news for veterinary college students in garividi vizianagaram district

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Garividi Veterinary College Good News,ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఆ విద్యార్థలందరికి పండగే, ఆ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది – union government good news for veterinary college students in garividi vizianagaram district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Garividi Veterinary College Good News: విజయనగరం జిల్లాలోని గరివిడి వెటర్నరీ కాలేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. కాలేజీ శాశ్వత సభ్యత్వాన్ని కొనసాగించడానికి అంగీకరించింది. చివరి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు చొరవతో అనుమతులు పునరుద్ధరించబడ్డాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనుమతులు రద్దయ్యాయని వారు తెలిపారు. కాలేజీలో అన్ని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి లలన్ సింగ్ హామీ ఇచ్చారు.

హైలైట్:

  • ఏపీకి కేంద్రం నుంచి మరో గుడ్‌న్యూస్
  • ఆ విద్యార్థులందరికి ఊరట దక్కింది
  • ఆ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుగా
గరివిడి వెటర్నరీ కళాశాలకు కేంద్రం గుడ్‌న్యూస్
గరివిడి వెటర్నరీ కళాశాలకు కేంద్రం గుడ్‌న్యూస్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది. విజయనగరం జిల్లాలోని గరివిడి వెటర్నరీ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలేజీ శాశ్వత సభ్యత్వాన్ని కొనసాగించడానికి కేంద్రం అంగీకరించింది. చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం కల్పిస్తారు.. అవసరమైతే విద్యార్థులను వేరే కాలేజీకి పంపిస్తారు. కేంద్ర మంత్రి ఈ విషయాన్ని అంగీకరించారు. గత ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడంతో కాలేజీ అనుమతులు రద్దయ్యాయి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో మళ్లీ అనుమతులు వచ్చాయి.కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీలో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లలన్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గరివిడి కాలేజీ సమస్య గురించి వివరించారు. ‘2018లో అప్పటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం గరివిడి వెటర్నరీ కాలేజీని ప్రారంభించింది.. గత ప్రభుత్వం కాలేజీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో కేంద్ర అధికారులు తనిఖీలు చేసి 2023లో అనుమతులు రద్దు చేశారు’ అని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ‘రానున్న నాలుగు, ఐదు నెలల్లో కాలేజీలో అన్ని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాము. కాలేజీకి అనుమతులు పునరుద్ధరిస్తాము’ అని కేంద్రమంత్రి లలన్ సింగ్ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడికి హామీ ఇచ్చారు.

నాకు చికెన్ పెట్టండి.. నేను తింటాను: మంత్రి అచ్చెన్నాయుడు

‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యపాలన, సహకార, మార్కెటింగ్ శాఖల గౌరవ మంత్రి శ్రీ కింజరాపు అచ్చన్నాయుడు గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారి తో కలిసి, కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖల మంత్రి శ్రీ లాలన్ సింగ్ గారిని కలిసాం. తోతాపురి మామిడి కొనుగోలుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పధకం కింద మద్దతు, అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా శ్రీకాకుళం తీరప్రాంతంలో మత్స్యకారుల కోసం మౌలిక వసతుల అభివృద్ధికి వినతిపత్రాలు సమర్పించాము. గరివిడి పశువైద్య కళాశాల మరియు దాని శాశ్వత సభ్యత్వ కొనసాగింపుకు సంబంధించిన అభ్యర్థనలను కూడా మేము సమర్పించాము. దీనికి మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. కేంద్ర మంత్రులు మా యొక్క ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తాము అని హామీ ఇచ్చారు. రైతుల హక్కులను కాపాడటానికి, అవసరమైన సమయంలో రైతుల పక్షాన నిలిచి వారిని ఆదుకునేందుకు నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. మొత్తం మీద గరివిడి వెటర్నరీ కాలేజీకి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి