Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ap Human Hair Exports,వెంట్రుకలే కదా అని తీసిపారేయడానికి లేదు.. సీఎం చంద్రబాబు వద్దకు చేరిన వ్యవహారం.. – ap chambers urges cm chandrababu to curbs on raw human hair exports to china

12 July 2025

Watch Video: కుక్క తెచ్చిన తంటా.. పొల్లు పొల్లు కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్!

12 July 2025

Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‏లోనే..

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Rides Ev Bicycle,సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్.. ఇంటర్ విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని.. ఇంతకీ ఎవరీ సిద్ధూ! – ap deputy cm pawan kalyan rides inter student ev bicycle and gives rs one lakh
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Rides Ev Bicycle,సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్.. ఇంటర్ విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని.. ఇంతకీ ఎవరీ సిద్ధూ! – ap deputy cm pawan kalyan rides inter student ev bicycle and gives rs one lakh

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Rides Ev Bicycle,సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్.. ఇంటర్ విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని.. ఇంతకీ ఎవరీ సిద్ధూ! – ap deputy cm pawan kalyan rides inter student ev bicycle and gives rs one lakh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Pawan Kalyan Appreciate Inter Student EV Bicycle: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం విద్యార్థి సిద్ధూని కలిసి అభినందించారు. సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేయడంతో పవన్ కళ్యాణ్ ముగ్దులయ్యారు. స్వయంగా సైకిల్ నడిపి, లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేశారు. అంతేకాదు, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వివేక్ భదర్వాజ్, బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ కలయికల వెనుక ఆంతర్యం ఏమిటి?

సిద్ధూకి పవన్‌ రూ.లక్ష ప్రోత్సాహకం
సిద్ధూకి పవన్‌ రూ.లక్ష ప్రోత్సాహకం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూను అభినందించారు. పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా సిద్ధూ గురించి తెలుసుకుని.. మంగళగిరిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. స్వయంగా సైకిల్‌పై అతన్ని కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్‌ను నడిపారు. సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేయడంతో.. ఈ ఆవిష్కరణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. సిద్ధూని అభినందించి.. సిద్ధూ ఆలోచనలకు ప్రోత్సాహంగా రూ.లక్ష అందజేశారు. సిద్ధూ రూపొందించిన ‘గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్’ బ్రోచర్‌పై ప్రశంసలు కురిపించారు. సిద్ధూది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస.. ప్రతి రోజూ కాలేజీకి వెళ్లడానికి ఇబ్బంది పడిన సిద్ధూ సొంతంగా బ్యాటరీ సైకిల్ తయారు చేశాడు. ఈ సైకిల్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చని సిద్ధూ చెబుతున్నారు.

‘విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధూ రూపొందించిన సైకిల్‌ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణలను పరిశీలించారు. అతని ఆలోచనలను మెచ్చుకుని భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలి అని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా లక్ష రూపాయలు అందించారు. అంతేకాకుండా సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ, కాలేజీకి వెళ్లేందుకు మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను స్వయంగా తయారు చేశాడు. ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది’ అంటూ ట్వీట్ చేశారు.

‘కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భదర్వాజ్ బృందం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో SVAMITVA యోజన పథకంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు’ అని తెలిపారు. అలాగే ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి