Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Farmers 80 Percent Discount On Drones,ఏపీ రైతులకు అద్భుత అవకాశం.. ఏకంగా 80శాతం డిస్కౌంట్, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు – andhra pradesh government provides drones for farmers with 80 percent subsidy here is full details
ఆంధ్రప్రదేశ్

Ap Farmers 80 Percent Discount On Drones,ఏపీ రైతులకు అద్భుత అవకాశం.. ఏకంగా 80శాతం డిస్కౌంట్, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు – andhra pradesh government provides drones for farmers with 80 percent subsidy here is full details

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Farmers 80 Percent Discount On Drones,ఏపీ రైతులకు అద్భుత అవకాశం.. ఏకంగా 80శాతం డిస్కౌంట్, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు – andhra pradesh government provides drones for farmers with 80 percent subsidy here is full details
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Farmers Drones 80 Percent Discount: రైతులకు వ్యవసాయంలో సహాయపడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్లను సబ్సిడీపై అందిస్తోంది. 80% సబ్సిడీతో రైతు గ్రూపులకు డ్రోన్లు ఇస్తున్నారు. దీని ద్వారా పురుగు మందులు పిచికారీ చేయడం, విత్తనాలు వేయడం సులభమవుతుంది. కూలీల కొరతను అధిగమించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయొచ్చు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ డ్రోన్‌ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీ రైతులకు ప్రభుత్వం అద్భుత అవకాశం
  • 80శాతం రాయితీతో డ్రోన్లను అందజేస్తోంది
  • ఐదుగురు రైతులు కలిసి ఒక సంఘం
ఏపీలో 80% రాయితీతో రైతులకు డ్రోన్లు
ఏపీలో 80% రాయితీతో రైతులకు డ్రోన్లు (ఫోటోలు– Samayam Telugu)

అవసరమైన యంత్రాలను సబ్సిడీపై అందజేస్తోంది. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే డ్రోన్ల పంపిణీ కొనసాగుతోంది. రైతులు వారి పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేయడం, విత్తనాలు వేయడానికి, ఎరువులు చల్లడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అందుకే డ్రోన్లను కూడా సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో రైతు గ్రూపులకు ఇస్తున్నారు.. మొదటి విడతగా డ్రోన్లను మంజూరు చేస్తోంది.రైతులు పొలాల్లో పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. మందులు, ఎరువులు పిచికారీ చేసేందుకు కూలీలకు రోజుకు ఎకరానికి రూ. 700 వరకు ఇస్తున్నారు. అలాగే 5 గంటల సమయం పడుతోందిది.. ఎకరానికి 200 లీటర్ల స్ప్రే అవసరం అవుతుంది. అదే డ్రోన్‌తో అయితే ఈ పనిని కేవలం 4 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు అంటున్నరు. అప్పుడు రైతులకు రూ.400 నుంచి రూ.500 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. అలాగే పొలానికి కేవలం 10 లీటర్ల మందు పిచికారీ చేస్తే సరిపోతుంది. రైతులు కూలీల కొరత సమస్యను అధిగమించడానికి ఈ డ్రోన్ విధానం ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక్కో డ్రోన్ ధర రూ.9.80 లక్షలుకాగా.. బ్యాంకు రుణం ద్వారా రూ.4.90 లక్షలు ఇస్తారు. రైతులు రూ.4.90 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీగా రూ.7.84 లక్షలు తిరిగి ఇస్తుంది. అప్పుడు రైతుకు ఈ డ్రోన్ దాదాపు రూ.2లక్షలకే (రూ.1,96,000)కే లభిస్తుంది. ఈ డ్రోన్ కోసం రైతులు కనీసం ఐదుగురు కలిసి ఒక గ్రూపు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి. అప్పుడు సదరు రైతుకు డ్రోన్‌తో ఎలా పని చేయాలి, దాని నిర్వహణ ఎలా, ఎరువులు, మందులు ఎలా పిచికారీ చేయాలి అనేది తెలుస్తుంది. అలా ఒక రైతును సెలక్ట్ చేసి 12 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అ లా శిక్షణ పొందిన రైతు మాత్రమే డ్రోన్‌తో పని చేయాలి.. ఈ మేరకు దీనికి సంబంధించిన నిబంధనలతో ఒక హామీ పత్రం కూడా ఇస్తారు.

సీఎం కారులో.. సీఎంతో కలిసి.. దళితుడి ప్రయాణం

రైతులు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అనుమతితో మరిన్ని డ్రోన్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ డ్రోన్ల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు. కూలీల కొరతను అధిగమించవచ్చు.. పెట్టుబడి కూడా ఒక సీజన్లోనే తిరిగి వస్తుంది. డ్రోన్ తీసుకున్న గ్రూప్ సభ్యులు తమ పొలాలతో పాటు ఇతరుల పొలాల్లో కూడా డ్రోన్లతో పని చేయవచ్చు. దీని ద్వారా రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదించవచ్చు. ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ఈ రోజుల్లో డ్రోన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. “ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి