Kanipakam Temple Damaged Milk: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పాలాభిషేకం కోసం తెచ్చిన పాలు విరిగిపోవడంతో కలకలం రేగింది. భక్తురాలు సమర్పించిన 10 లీటర్ల పాలు పనికిరావని గుర్తించి, ఈవో పెంచల కిషోర్ వాటిని పారబోయించారు. పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు.. మరోసారి ఈ తప్పు జరగదు అన్నారు. తిరుమల తరహాలో ఉచిత సేవలు ప్రారంభించాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నిర్ణయించారు.
హైలైట్:
- కాణిపాకం ఆలయంలో అపచారం
- పాపం ఆ భక్తురాలు ఆశగా వెళితే
- కాంట్రాక్టర్ తీరుపై ఈవో ఆగ్రహం

దక్షిణ భారతదేశంలో చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయం ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయంలో శివుడు, పార్వతిల కుమారుడైన గణేశుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. వినాయకుడి విగ్రహం ఎప్పుడూ నీటిలో ఉంటుంది. అంతేకాదు, రోజురోజుకీ పెరుగుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే స్వామివారికి పాలతో అభిషేకం చేస్తుంటారు. ఈ క్రమంలోనే పాలు విరిగిపోవడం కలకలం రేపింది.
శ్రీశైలం నుంచి సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు.. జలహారతి ఇచ్చిన సీఎం
తిరుమల తరహాలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉచిత సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సేవకుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని.. క్యూలైన్లు, అన్నదానం వంటి చోట్ల వారి సేవకుల ద్వారా సేవలను వినియోగిస్తారన్నారు. కాణిపాకం ఆలయంలో ఉచితంగా సేవ చేసేవారికి వసతులు కల్పిస్తామని.. దీనివల్ల భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు.. ఆలయ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది అన్నారు.