Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BAPS: బీఏపీఎస్ డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి అమెరికాలో విశేష గౌరవం

31 July 2025

Tollywood: ఈ ఇద్దరిలో ఒకరు పాన్ ఇండియా హీరోయిన్.. తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్టే.. ఎవరో గుర్తు పట్టారా?

31 July 2025

శ్రావణ మాసంలో వచ్చే కలలకు అర్థం ఏంటో తెలుసా..? ఈ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి..!

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bandi Sanjay On Ttd Non Hindu Employees,టీటీడీలో ఆ ఉద్యోగుల్ని వెంటనే తొలగించాలి.. కేంద్రమంత్రి బండి సంజయ్ – ttd should remove non hindu employees says union minister bandi sanjay
ఆంధ్రప్రదేశ్

Bandi Sanjay On Ttd Non Hindu Employees,టీటీడీలో ఆ ఉద్యోగుల్ని వెంటనే తొలగించాలి.. కేంద్రమంత్రి బండి సంజయ్ – ttd should remove non hindu employees says union minister bandi sanjay

.By .11 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bandi Sanjay On Ttd Non Hindu Employees,టీటీడీలో ఆ ఉద్యోగుల్ని వెంటనే తొలగించాలి.. కేంద్రమంత్రి బండి సంజయ్ – ttd should remove non hindu employees says union minister bandi sanjay
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD Non Hindu Employees: టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థుల తొలగింపు అంశం రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు పనిచేస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై విశ్వాసం లేనివారికి శ్రీవారి సేవలో చోటు లేదని ఆయన అన్నారు. దీనిపై టీటీడీ పాలకమండలి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కోరారు.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి సేవలో బండి సంజయ్
  • టీటీడీలో అన్యమత ఉద్యోగులపై స్పందన
  • వెంటనే వారిని తొలగించాలన్న కేంద్రమంత్రి
టీటీడీ అన్యమత ఉద్యోగులు
టీటీడీ అన్యమత ఉద్యోగులు (ఫోటోలు– Samayam Telugu)

టీటీడీలో ఆ ఉద్యోగులందర్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్. టీటీడీలో ఏకంగా వెయ్యిమందికిపైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని.. వారికిసనాతన ధర్మంపై విశ్వాసం లేదన్నారు. టీటీడీ పాలకమండలి వెంటనే స్పందించి.. అన్యమతస్థులైన ఉద్యోగులందర్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి సేవలో నిజమైన భక్తి ఉన్నవారు.. నిబద్ధతతో పనిచేసే వారికే అవకాశం కల్పించాలన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కేంద్రమంత్రికి ఆలయ అర్చకులు వేదఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్టు చెప్పారు. టీటీడీలో ఉన్న వెయ్యిమందికి పైగా అన్యమతస్థులు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నారని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు బండి సంజయ్. టీటీడీ ఏ ఒక్కరి ఆస్తి కాదని.. హిందువులది మాత్రమేనన్నారు. ఇటీవల ఓ ఉద్యోగిని టీటీడీ తొలగించిందని.. ఒకరిని తొలగిస్తే సరిపోదని, టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలన్నారు. అన్యమతస్థులపై సమగ్ర విచారణ జరిపి టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని కోరారు. ‘కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ ఆలయం, ఇల్లెందు రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ సహకారం అందించాలి’ అన్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా టీటీడీ అంశంపై స్పందించారు. టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతికి, అవకతవకలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని.. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని చెప్పారు. దేవుడు గత పాలకులను కఠినంగా శిక్షిస్తున్నాడని.. భవిష్యత్తులో మరోసారి ఇలాంటివి జరగకుండా కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. లడ్డూల కోసం క్యూ అవసరం లేదు

టీటీడీ ఇటీవల అన్యమతం వ్యవహారంలో ఓ అధికారిని తొలగించింది.. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది’ అంటూ టీటీడీ స్పందించింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి