సాధారణంగా సినీరంగంలోని స్టార్స్ ఆటో మొబైల్స్, ఫ్యాషన్స్, వాచ్ కలెక్షన్స్, లగ్జరీ లైఫ్ గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈమధ్యకాలంలో తారల సినిమా అప్డేట్స్ కాకుండా.. వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ పాన్ ఇండియా స్టార్ హీరో లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. అతడు మరెవరో కాదండి.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ ఆస్తులు రూ.3000 కోట్లు. అయినా ఇప్పటికీ ముంబైలోని ఒక సాధారణ 1BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. కానీ తనకు నచ్చిన వస్తువులపై ఖర్చు పెట్టేందుకు సల్మాన్ ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇప్పుడు సల్మాన్ లగ్జరీ వాచ్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం.
నిజానికి సల్మాన్ ఖాన్ వాచ్ ప్రియుడు. సినిమాలు కాకుండా బయట ఈవెంట్లలో పాల్గొన్న ప్రతిసారి కొత్తరకం లగ్జరీ టైమ్ పీస్ ధరిస్తుంటారు. రిచర్డ్ మిల్లె నుంచి రోలెక్స్, జాకబ్ & కో, ఆడెమర్స్ పిగ్యుట్, పటేక్ ఫిలిప్ వరకు .. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన గడియారాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్ విలువ దాదాపు రూ.140 కోట్లు. ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది 2020 ఇండియా, చైనా ఘర్షణ ఆధారంగా డైరెక్టర్ అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తుంది.
ఇవి కూడా చదవండి
సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్..
- పటేక్ ఫిలిప్ అక్వానాట్ లూస్ రెయిన్బో – రూ. 42 కోట్లు
- జాకబ్ & కో బిలియనీర్ III – రూ. 41.28 కోట్లు
- రిచర్డ్ మిల్లె RM 53-01 పాబ్లో మాక్ డోనఫ్ – రూ. 21 కోట్లు
- రిచర్డ్ మిల్లె RM 022 ఏరోడైన్ – రూ. 12 కోట్లు
- ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ డైమండ్ – రూ. 12 కోట్లు
- పటేక్ ఫిలిప్ నాటిలస్ వైట్ గోల్డ్ డైమండ్ – రూ. 5.1 కోట్లు
- రోలెక్స్ డేటోనా రెయిన్బో రోజ్ గోల్డ్ – రూ. 3.85 కోట్లు
- హబ్లాట్ స్పిరిట్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ సాంగ్ బ్లీ హై – రూ. 3.42 కోట్లు
- రోలెక్స్ డేటోనా ప్లాటినం పేవ్ డైమండ్ – రూ. 2.8 కోట్లు
- రోలెక్స్ GMT మాస్టర్-II సఫైర్ రూబీ డైమండ్ పేవ్ – రూ. 2.62 కోట్లు
- ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ ఫ్లయింగ్ టూర్‌బిల్లాన్ రోజ్ గోల్డ్ – రూ. 2.14 కోట్లు
- రోలెక్స్ స్కై-డ్వెలర్ మెటియోరైట్ డయల్ విత్ డైమండ్స్ – రూ. 1.8 కోట్లు
- పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ క్రోనోగ్రాఫ్ – రూ. 1.1 కోట్లు
- జాకబ్ & కో X రామ్ జన్మభూమి – రూ 61 లక్షలు
- జాకబ్ & కో ది వరల్డ్ ఈజ్ యువర్స్ డ్యూయల్ టైమ్ జోన్ — రూ. 36.6 లక్షలు.
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..