మంగళూరు శివార్లలోని సూరత్కల్‌లోని రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ (MRPL) యూనిట్‌లో విషపూరిత వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన దీప్ చంద్ర భారతీయ (33), కేరళకు చెందిన బిజిల్ ప్రసాద్ (33)గా గుర్తించారు. వారిని రక్షించడానికి ప్రయత్నించిన గడగ్‌కు చెందిన వినాయక్ అస్వస్థతకు గురై పరిస్థితి విషమంగా ఉంది. MRPL OMS (ఆయిల్ మూవ్‌మెంట్ సర్వీస్) లోపాన్ని గుర్తించిన కార్మికులు తనిఖీ చేయడానికి వెళ్లారు. MMS సెక్షన్ ట్యాంక్ పైకప్పుపైకి వెళ్తున్నప్పుడు విషపూరిత వాయువును పీల్చిన తర్వాత వారు అస్వస్థతకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన దీపచంద్ర, బిజిల్ లను తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. గదగ్ కు చెందిన వినాయక్ మాయగేరి మంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి MRPL డైరెక్టర్ల బోర్డు గ్రూప్ జనరల్ మేనేజర్ తో సహా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఉదయం విష వాయువు పీల్చి మొత్తం ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్దరు మరణించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు కోలుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి