Vaibhav Suryavanshi : ఇంగ్లాండ్‌పై యూత్ వన్డే సిరీస్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి యూత్ టెస్ట్ సిరీస్ అంతగా అచ్చి రాలేదు. ఇంగ్లాండ్ అండర్-19, భారత్ అండర్-19 మధ్య బెకెన్‌హామ్‌లో జరుగుతున్న మొదటి యూత్ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో సూర్యవంశీ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. గతంలో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనలను చూసి క్రికెట్ అభిమానులు అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించారు.. కానీ అది నెరవేరలేదు.
బెకెన్‌హామ్‌లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మొదటి యూత్ టెస్ట్ మొదటి రోజున, వైభవ్ సూర్యవంశీ భారత్ అండర్-19 ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించడానికి ప్రయత్నించాడు. కానీ అతని ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. అతను కేవలం 14 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ పర్యటనలో అతను 30 పరుగుల మార్కును చేరుకోలేకపోవడం ఇదే మొదటిసారి, కాబట్టి ఇది అతనికి ఒక నిరాశపరిచే సంఘటన. దీనికి ముందు తను ఈ పర్యటనలో ఆడిన ప్రతి ఇన్నింగ్స్‌లో 30కి పైగా పరుగులు సాధించాడు.
వైభవ్ సూర్యవంశీకి ఇది అతని యూత్ టెస్ట్ కెరీర్‌లో మూడో మ్యాచ్. దీనికి ముందు అతను ఆస్ట్రేలియా జట్టుతో 2 మ్యాచ్‌లు ఆడాడు. ఆ రెండు మ్యాచ్‌లలో అతను 108 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అది భారత్ తరపున యూత్ టెస్ట్‌లలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు.
వైభవ్ సూర్యవంశీ ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో అతను 52 బంతుల్లో సెంచరీ సాధించి, యూత్ వన్డేలలో అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. దీనితో పాటు తను ఒక మ్యాచ్‌లో 31 బంతుల్లో 86 పరుగులు చేసి, భారత్ 3-2తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టెస్ట్ ఫార్మాట్‌లో తన ఆరంభం అంత గొప్పగా లేదు.రాబోయే ఇన్నింగ్స్‌లలో అతను అద్భుతంగా రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..