Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ రోడ్డు నుంచి సంగీతం వస్తుంది.. ఆ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే వీడియో

13 July 2025

YSRCP vs TDP: మచిలీపట్నంలో పేర్నినానిపై కేసు నమోదు… పామర్రు మీటింగ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ

13 July 2025

హాయిగా రాత్రంతా నిద్రపోయినందుకు .. రూ.9 లక్షలు వచ్చిపడ్డాయి వీడియో

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nagarjunasagar Airport,ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే.. ఆ జిల్లా యువతకు పండగే! – ap nagarjunasagar airport expansion plans in palnadu district
ఆంధ్రప్రదేశ్

Nagarjunasagar Airport,ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే.. ఆ జిల్లా యువతకు పండగే! – ap nagarjunasagar airport expansion plans in palnadu district

.By .12 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nagarjunasagar Airport,ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే.. ఆ జిల్లా యువతకు పండగే! – ap nagarjunasagar airport expansion plans in palnadu district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో కొత్త ఎయిర్‍పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా నాలుగు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టు అంశంలో కీలక అప్‌డేట్ వచ్చింది. నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలించి.. టెక్నికల్ అండ్ ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్టు తయారీకి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ బిడ్లను ఆహ్వానిస్తోంది.

ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే.. ఆ జిల్లా యువతకు పండగే!
ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే.. ఆ జిల్లా యువతకు పండగే! (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో నాలుగు చోట్ల కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌ వద్ద ఎయిర్‌పోర్టు విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి సర్వే చేయాలని.. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రకటన జారీ చేసింది. అలాగే నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించిన టెక్నికల్, ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్టు తయారీకి సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఆన్‌లైన్‌‍లో బిడ్లు దాఖలు చేసేందుకు జూలై 29వ తేదీ వరకూ గడువు ఉంది. ఆగస్ట్ నాలుగో తేదీన బిడ్లు తెరవనున్నారు.

ఇక బిడ్డింగ్‌లో బిడ్ దక్కించుకున్న కంపెనీ.. నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై సాంకేతిక, ఆర్థిక అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి, సర్వే చేసి వివరాలు సేకరించనుంది. అనంతరం ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీకి అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టుకు ఎన్ని ఎకరాల భూమి అవసరం అవుతుంది, ఎంత మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందనే దానిపై అధికారులు ఓ క్లారిటీ రానున్నారు. ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తారు.

మరోవైపు నాగార్జునసాగర్ వద్ద ఇప్పటికే ఎయిర్‌డ్రోమ్ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అప్పటి ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాందీ రావటం కోసం ఈ ఎయిర్‌డ్రోమ్ నిర్మించారు. అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఈ ఎయిర్‌డ్రోమ్‌ నిర్వహణను పట్టించుకోలేదు. అయితే 2010లో ఓ ప్రైవేట్ సంస్థ దీనిని లీజుకు తీసుకుంది. పైలెట్ ట్రైనింగ్ కోసం నాగార్జునసాగర్ ఎయిర్‌డ్రోమ్‌ను ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. అయితే ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మరో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టును విస్తరించాలని ప్రణాళికలు రచించారు.

నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి అయ్యి.. అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అలాగే పల్నాడు జిల్లా రూపురేఖలు కూడా మారిపోతాయ్. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి