తిరువనంతపురంలోని పెప్పరలో ఓ నివాస ప్రాంతంలోని కాలువలో స్థానికులు ఓ భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పరుథిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి దాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. 18 అడుగుల పొడవున్న ఆ కింగ్ కోబ్రాను చాలా ప్రశాంతంగా ఓ కట్టె సాయంతో పట్టుకొని సంచిలో బంధించారు. స్థానికులు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. గతంలోనూ రోషిణి ఇలాగే 500లకు పైగా పాములను బంధించినట్లు తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!