తెలంగాణ వాటర్ వార్‌లో నయా ట్రెండ్ షురూ అయింది. ప్రాజెక్టులు, వాటి ఖర్చుల లెక్కలు, అవినీతి ఆరోపణలు, అంకెలు-రంకెలు పక్కకుపోయాయి. ప్రస్తుతం నీటి పారుదల రాజకీయం ప్రవహిస్తోంది. ప్రాజెక్టుల చుట్టూ లేటెస్ట్ పొలిటికల్ రౌండ్ షురూ అయింది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత బీఆర్‌ఎస్ సర్కార్…సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రాజెక్టుల నుంచి కాంగ్రెస్ సర్కార్ విడుదల చేస్తున్న ప్రతి నీటిబొట్టు తమ కష్టమే అంటోంది గులాబీ పార్టీ. నీటి విడుదల తమ పుణ్యమే అంటూ క్లెయిమ్ చేసుకుంటోంది బీఆర్‌ఎస్..
లేటెస్టుగా భద్రాద్రి సీతారామ ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు. అశ్వాపురం మండలం బీ.జీ. కొత్తూరు దగ్గర.. మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ప్రవహించాయి. సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యం కావడంతో.. పంటలు ఎండకుండా గోదావరి జలాలను విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.
సీతారామ తమ కష్టమే అంటున్న BRS
ఇదంతా తమ కష్టమే అంటోంది బీఆర్‌ఎస్. గతంలో కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసినట్టే, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్. ఈమేరకు ఆయన Xలో పోస్ట్ చేశారు. సీతారామ ప్రాజెక్ట్ నుంచి జలాల విడుదల క్రెడిట్ తమదేనంటూ చెప్పకనే చెప్పారు హరీష్.
కల్వకుర్తి విషయంలోనూ సేమ్ సీన్
ఇక కొద్ది రోజుల ముందు కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. అప్పుడు కూడా ఇలాంటి ట్వీట్‌తోనే పొలిటికల్ హీట్ పెంచారు హరీష్. సాగునీరందక అవస్థపడుతున్న లక్షలాదిమంది రైతులతో తరలివచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటేగాని ప్రభుత్వంలో చలనం రాలేదని, తాము ప్రశ్నించాకే.. కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని విడుదల చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అది తమ విజయమే అంటూ తమ ఖాతాలో వేసేసుకున్నారు హరీష్‌రావు. బొట్టుబొట్టులో రాజకీయంతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..