ఆచార్య చాణక్య గొప్ప ఆర్థికవేత్త, మార్గదర్శకుడు. ఆయన జీవితంలోని ప్రతి అంశంపై చర్చించాడు. అది రాజకీయాలు అయినా లేదా జీవితంలోని చిన్న ,పెద్ద విషయాలు అయినా ఆయన తన విధానాల ద్వారా సరైన మార్గాన్ని చూపించారు. ఆయన విధానాలు జీవితాన్ని ఎలా గడపాలో మనకు చెబుతాయి. నేటికీ చాలా మంది చాణక్య విధానాలను అనుసరిస్తారు. చాలా మంది చాణక్య విధానాలను అనుసరించడం ద్వారా తమ జీవితాలను మరింత అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చాణక్య చెప్పిన కొన్ని ముఖ్యమైన విధానాల్లో డబ్బును ఎలా ఖర్చు చేయాలి, డబ్బును ఎలా ఆదా చేయాలి అనేది ఒకటి. ఎవరైనా సరే ఆచార్య చాణక్య విధానాలను అనుసరించే వారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. చిన్న వయస్సులోనే ధనవంతులు కావచ్చు. ఈ రోజు మనం ఆయన చెప్పిన విధానం గురించి వివరంగా తెలుసుకుందాం..
కష్టాల్లో సంతోషంగా..
ఆచార్య చాణక్యుడి సూత్రాలను పాటించే వ్యక్తి కష్ట సమయాల్లో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదైనా కోల్పోయినా..వాటిని తిరిగి పొందడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు. ధైర్యంగా మళ్ళీ లేచి నిలబడి విజయం సాధిస్తారు.
.
సౌకర్యం
ప్రతి వ్యక్తి విద్య, ఆరోగ్యం, మంచి ఆహారం, మంచి జీవన ప్రమాణాల కోసం డబ్బు ఖర్చు చేయాలి. తమ కుటుంబ సభ్యుల సౌకర్యాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకూడదు.
సంపదను సముచితంగా ఉపయోగించడం
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన ఆదాయంలో కొంత మొత్తాన్ని దానధర్మాలకు లేదా పుణ్యకార్యాలకు ఖర్చు చేయాలి. ఎవరైనా అవసరం ఉన్నవారికి డబ్బులు, ఆహారం, బట్టలు దానం చేయడం పుణ్యకార్యం.
ఇవి కూడా చదవండి
సంపద, డబ్బు
పేదలకు సహాయం చేసే వ్యక్తులు ఎల్లప్పుడూ సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తారు. అంతేకాదు తమ సంపదను ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఖర్చు చేసే అలవాటుని చేసుకోవాలి. ఇలా చేయడం వలన దేవతల ఆశీస్సులు లభిస్తాయి. దాన ధర్మాలతో అశుభ గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. అలాంటి వ్యక్తులు ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించరు. ఎప్పుడూ డబ్బు లేకపోవడం అన్న మాటే ఉండదు. వీరిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.