దేశంలో పెరుగుతున్న నిద్ర లేమిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా స్లీప్ ఇంటర్న్‌షిప్ ను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేవలం 15 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రతి దరఖాస్తుదారునికి ఒక పరుపు , ప్రతి రాత్రి వారి అలవాట్లను పర్యవేక్షించే కాంటాక్ట్‌లెస్ స్లీప్ ట్రాకర్‌ను అందించారు. ఈ ఇంటర్న్‌షిప్ అంతటా వారు బెడ్‌పై పడుకుని హాయిగా నిద్రపోవడమే టాస్క్. మెరుగైన నిద్రను పెంచే వర్క్‌షాప్‌ల్లో కూడా పాల్గొన్నారు. ఫైనలిస్టులు కళ్ళకు గంతలు కట్టుకుని మంచం తయారు చేయడం, అలారం గడియారం నిధి వేటలు, వారి క్రమశిక్షణను పరీక్షించడానికి స్లీప్-ఆఫ్ వంటి సరదా గేమ్‌లను కూడా నిర్వహించారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో వావల్ 91.36 స్కోరుతో ఇతర ఇంటర్న్‌లను అధిగమించి టైటిల్‌ని గెలుచుకుంది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన 15 మందికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున బహుమతి అందించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!