ఉత్తరాఖండ్‌లో ‘ఆపరేషన్ కాలనేమి’ ప్రారంభంతో.. రామాయణంలోని పాత్ర అయిన కాలనేమి కూడా వెలుగులోకి వచ్చింది. నార్త్ ఇండియాలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులను బురుడీ కొట్టించేందుకు దొంగ సాధువులు పుట్టికోస్తారు. రకరకాల వ్యక్తులు సాధువులుగా వేషం వేసుకుని ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దొంగ సాధువుల ఆగడాలను అరికట్టేందుకు దొంగ సాధువులు ఉంటారు జాగ్రత్త అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రమత్తం చేస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం జూలై 11న ప్రారంభమైంది.
హిందువుల భక్తిని, విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని మోసం చేసే వారిపై ఆపరేషన్ కాలనేమి అనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లో, సాధువులు, ఋషుల వేషంలో అమాయక పౌరులను మోసం చేస్తున్న వ్యక్తులను అనేక ప్రదేశాల నుంచి పట్టుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆపరేషన్ కాలనేమి అనే పేరు పెట్టడంతో .. సర్వత్రా ఈ కాలనేమి ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ కాలనేమి రామాయణంతో ముడుపడి ఉంది. ఈ రోజు ఈ ఆపరేషన్ కాలనేమితో అతనికి సంబంధం ఏమిటి తెలుసుకుందాం.
కలనేమి ఎవరు?
ఇవి కూడా చదవండి
కాలనేమికి రామాయణ గాథతో సంబంధం ఉంది. రామాయణంలో కాలనేమి ఒక మాయ రాక్షసుడు. కాలనేమి మారీచుడి కుమారుడు. సీతారాముల ఎడబాటుకి, రామరావణ యుద్ధానికి కారణమైన వ్యక్తి. రామాయణం ప్రకారం లంకాలో రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు మేఘనాథుడు ప్రయోగించిన శక్తి బాణం కారణంగా లక్ష్మణుడు మూర్ఛ పోయాడు. అప్పుడు చికిత్స కోసం సంజీవని మూలికను తీసుకురావడానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్నే తీసుకువచ్చి మూర్ఛనుంచి తేర్చాడు. మరోసారి మళ్ళీ యుద్ధంలో లక్ష్మణాదులు మూర్ఛపోతే ద్రోణగిరిపై ఉన్న విశల్యకరణి అనే మూలిక తేవాలని జాంబవంతుడు చెప్తే హనుమంతుడు ఆ మూలికను తీసుకుని రావడానికి బయలు దేరాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు రావణాసురుడు.
రావణాసురుడు కాలనేమిని పిలిచి హనుమంతుడు ద్రోణగిరికి వెళ్తున్న సమయంలో హనుమంతుడిని దారితప్పించి అక్కడ ఉన్న మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని ఆజ్ఞాపించాడట. రావణుడి ఆజ్ఞను పాటిస్తూ కాలనేమి.. హనుమంతుడు ద్రోణగిరికి మార్గంలో మహర్షి రూపంలో జపంచేస్తూ కనిపించాడు. అపుడు కాలనేమిని ద్రోణగిరికి ఎలా వెళ్లాలి అని అడగగా.. ఇక్కడ ఉన్న సరస్సులో నీరు త్రాగి, స్నానం చేస్తే దప్పికతీరి, కార్యసాధనకు శక్తి వస్తుందని హనుమంతుడికి చెప్పి నమ్మించాడు. దీంతో హనుమాన్ ఆ కొలనులోకి దిగాడు. అప్పుడు కొలనులోని మొసలి హనుమంతుడిని పట్టుకుంది. అప్పుడు ఆ మొసలిని హనుమంతుడు చంపేశాడు. అప్పుడు ఆ మొసలి ధాన్యమాలిని అనే అప్సరసగా మారి తన శాపం గురించి చెప్పడమే కాదు కాలనేమి గురించి ..ద్రోణగిరికి దారి చెప్తుంది. అప్పుడు హనుమంతుడు కాలనేమి ఆశ్రమానికి వెళ్లి.. సహాయం చేసినందుకు గురుదక్షిణ కోరుకున్న కాలనేమిని యమపురికి పంపిస్తాడు హనుమంతుడు. ఇదీ రామాయణంలో కాలనేమి కథ. అంతేకాదు ద్వాపర యుగంలో ఈ కాలనేమి కంసుడిగా జన్మించాడు. అప్పటి నుంచి వేషాలు మార్చి, మాయచేస్తూ భక్తులను పూజాపునస్కారాలంటూ మోసం చేసేవారిని కాలనేమి జపం అనడం పరిపాటి. అందుకనే ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో నడుస్తున్న ఆపరేషన్ కలనేమికి ఈ పేరు పెట్టారు. మారువేషంలో ప్రజలను దోచుకుని మోసం చేస్తున్న దొంగ బాబాల పని పడుతుంది. అందుకనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ కాలనేమి అని పేరు పెట్టింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.