లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాస రావు (83) కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలు సినీరంగంలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. 750కు పైగా సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో తనదైన ముద్రవేశారు. సినిమా పరిశ్రమలో ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన కోటా మరణం ఇండస్ట్రీకి తీరని లోటే. ఇప్పుడు ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే కోటా పోషించిన పాత్రలు, ఆయన నటించిన అనేక చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు అభిమానులు.
ఈ క్రమంలోనే గతంలో కోటా చెప్పిన మాటలను సైతం గుర్తుకు చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో తాను అనారోగ్యం పాలైనప్పుడు కోటా చనిపోయారంటూ ఆయన బతికి ఉండగానే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో ఆ వార్తలను ఖండిస్తూ కోటా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“ఆర్టిస్టుకు టైమ్ అంటూ వస్తుంది. ఆ టైమ్ వచ్చిందంటే నీకు ఇక టైమ్ ఉండదు. అప్పుడే అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తనే మనకు పని కల్పిస్తుంది. అది బాగుంటే బాగుంటావ్.. లేదంటే ఆస్తులు పోగొట్టుకుని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి వాళ్లను ఇండస్ట్రీలో ఎంతమందిని చూడలేదు. ఆ భగవంతుడి దయవల్ల అలాంటివేం జరగలేదు. ఏదో వెళ్లిపోతాను. టైమ్ వచ్చినప్పుడు టైమ్ ఉండదు. వాడెవడో కోటా శ్రీనివాస రావు చనిపోయాడని బతికుండగానే చంపేశారు. నాకు ఆరోగ్యం బాలేదంటే నేనే చెప్తాను కదా.. వయసు మీద పడినప్పుడు అన్నీ బాగోవు… నాకు అనారోగ్యంగా ఉంటే చనిపోయానని రాశారు. వాడ్ని పిలిచి గట్టిగా అరిచా.. అది తప్పయ్యా.. మీ నాన్నకి 70, 80 ఏళ్లు వస్తే కాళ్ల నొప్పో కళ్ల నొప్పో వస్తుంది కదా.. నాకు అలాగే వచ్చింది.. నేను మనిషికనే కాద.. నా చావు మీద వార్త రాసి రూపాయి సంపాదిస్తావా ? ఇంకోసారి సుశీల, జానకి ఇలా చాలామందిని చంపేశారు. సుశీల గారు ఎక్కడో అమెరికాలో ఉంటే నేను బాగానే ఉన్నాను. నీ మీద ఇలా తప్పుడు వార్తలు రాయొద్దని అన్నారు. నాకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. మనిషి బతికి ఉండగానే చంపేయడం దారుణం ” అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..
Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే..