Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

13 July 2025

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kota Srinivasa Rao Hinduism Video,హిందూయిజానికి పర్ఫేక్ట్ డెఫినేషన్ చెప్పిన కోటా శ్రీనివాసరావు.. పాత వీడియో వైరల్ – kota srinivasa rao excellent words about hinduism in telugu old video went viral now
ఆంధ్రప్రదేశ్

Kota Srinivasa Rao Hinduism Video,హిందూయిజానికి పర్ఫేక్ట్ డెఫినేషన్ చెప్పిన కోటా శ్రీనివాసరావు.. పాత వీడియో వైరల్ – kota srinivasa rao excellent words about hinduism in telugu old video went viral now

.By .13 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kota Srinivasa Rao Hinduism Video,హిందూయిజానికి పర్ఫేక్ట్ డెఫినేషన్ చెప్పిన కోటా శ్రీనివాసరావు.. పాత వీడియో వైరల్ – kota srinivasa rao excellent words about hinduism in telugu old video went viral now
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే, ఆయన మరణానంతరం, హిందూయిజంపై కోటా శ్రీనివాసరావు చేసిన ఒక పవర్ఫుల్ ప్రసంగం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన హిందూయిజం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఇంతకీ ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు? ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది అనే వివరాలు తెలియాలంటే ఇది చదవండి

హైలైట్:

  • హిందూయిజంపై కోటా పవర్‌ఫుల్ స్పీచ్
  • ఐదేళ్ల నాటి వీడియో ఇప్పుడు వైరల్
  • కోటా స్పీచ్‌పై ప్రశంసలు
హిందూయిజంపై కోటా పవర్‌ఫుల్ స్పీచ్
హిందూయిజంపై కోటా పవర్‌ఫుల్ స్పీచ్ (ఫోటోలు– Samayam Telugu)

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు.. ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో కన్ను మూశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో కోటా శ్రీనివాసరావు ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు. సుమారు 750 కు పైగా చిత్రాల్లో నటించారు. 9 నంది అవార్డులు అందుకున్నారు. మరెన్నో ప్రశంసలు, ఎందరో అభిమానులను సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, సినీ, రాజకీయ ప్రముఖులు కోటా శ్రీనివాసరావు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హిందూయిజంపై కోటా శ్రీనివాసరావు చేసిన పవర్‌ఫుల్ స్పీచ్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలు.. ప్రస్తుతం దేశంలో హిందూయిజం అంటూ హడావుడి చేస్తున్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే వీరందరికి ధీటుగా.. హిందూయిజానికి అసలుసిసలు అర్థం చెప్పారు కోట శ్రీనివాసరావు. హిందూయిజంపై ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వింటే గూస్‌బంప్స్ పక్కా. గతంలో కోటా శ్రీనివాసర రావు హిందూయిజంపై మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం అనవసరంగా హిందూయిజం మీద రాద్ధాంతం చేస్తుంది. అసలు ఇంత హడావుడి చేయడం అనవసరం అని నా ఉద్దేశం. అమ్మను అమ్మా అని పిలవడం తప్పా. మనం మన కన్నతల్లిని అమ్మా అని పిలుచుకుంటున్నాం. అంతే తప్ప.. వాళ్ల మాదిరి అమ్మను అమ్మా అని పిలివడానికి సిగ్గుపడి.. అలా పిలిపించుకోవడానికి తల్లులు కూడా సిగ్గుపడి.. మమ్మీ అని పిలిపించుకునే సంస్కారం మనది కాదు కదా. అసలేంటి హిందూత్వం.. ఎందుకు దీని మీద ఇంత వివాదం నాకు అర్థం కావడం లేదు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ముందు మీర ఒక్క అంశాన్ని గుర్తించండి. ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఇండియా అంటాయి. కానీ మన ఆగర్భ శత్రువు పాకిస్థాన్ మాత్రం.. మైకులు ముందు కూర్చుని హిందూస్థాన్ మే అంటుంది. మన చిరకాల శత్రువే మనది హిందూ దేశం అని ఒప్పుకుంటుంది. ఇంకా ఎందుకు దీని గురించి అనవసర వివాదాలు, రాద్ధాంతం. ఇలా చేసే వాళ్లు పిచ్చోళ్లు.. వాళ్లవి పిచ్చి మాటలు. పైగా హిందూయిజం నశించాలి.. హిందూయిజం, ఉగ్రవాదం అనే వాళ్లంతా పైన పరిపాలిస్తూ.. తమ ప్రసంగం పూర్తయ్యాక చివర్లో జైహింద్ అంటారు. అదేంటో అర్థం కాదు. హిందూయిజాన్ని వ్యతిరేకించే వారు మళ్లీ జైహింద్ అనడం ఏంటో’’ అంటూ కోట సెటైర్లు వేశారు.

ఇక ఈ వీడియో ఐదు సంవత్సరాల క్రితం నాటిది అని తెలుస్తోంది. అయితే ఆయన ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారో తెలియాదు. కానీ ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. హిందూయిజానికి పర్ఫెక్ట్ మీనింగ్ చెప్పారు సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి