India vs England Test: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ నైపుణ్యానికి పెట్టింది పేరు. లండన్‌లోని లార్డ్స్‌లో ఇది కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం 74 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
కానీ, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రా జీరో పరుగులకే పెవిలియన్ చేరాడు. అంటే, ఒక్క పరుగు కూడా చేయకుండానే వికెట్ ఇచ్చాడు. విశేషమేమిటంటే బుమ్రా పరుగు కూడా చేయకుండా వరుసగా సున్నా స్కోరుకే వికెట్ ఇవ్వడం ఇది 4వ సారి. ముఖ్యంగా గత 7 ఇన్నింగ్స్ లలో టీమిండియా పేసర్ 6 సార్లు సున్నా స్కోరుకే ఔటయ్యాడు.
జస్ప్రీత్ బుమ్రా తన గత 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. అందులో సున్నాకి ఆరు సార్లు పెవలియన్ చేరాడు. తన చివరి 7 ఇన్నింగ్స్‌లను గమనిస్తే.. 0, 0, 22, 0, 0, 0, 0, 0 ఇలా ఉన్నాయి.
టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 72 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రా 28 సార్లు సున్నాకి ఔటయ్యాడు. దీంతో, టెస్ట్ చరిత్రలో అత్యధిక సార్లు సున్నాకి ఔట్ అయిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను 10వ స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌లలో అత్యధిక సార్లు సున్నాకి ఔట్ అయిన 2వ భారతీయుడు కూడా అతను.
ఈ జాబితాలో ఇషాంత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 142 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో భారతదేశం తరపున బ్యాటింగ్ చేసిన ఇషాంత్ 34 వికెట్లు జీరో పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో, టెస్టుల్లో అత్యధిక జీరోలు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు, జస్ప్రీత్ బుమ్రా 28 సున్నాలతో ఈ జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నాడు.