తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకోవడం కోసం వాహనదారులు ఎన్ని లక్షలు ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. రైజింగ్ నెంబర్ 9 సిరీస్ రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తుంది.. 9999 నెంబర్‌ను ఓ కాంట్రాక్టర్ ఏకంగా 11,09,999 రూపాయలకు కైవసం చేసుకొని ప్రతి ఒక్కరూ షాక్ అయ్యేలా చేశాడు.. 0009 నెంబర్‌ను మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ 5,72,999 రూపాయలకు దక్కించుకున్నారు. వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ వేలంపాటలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన హర్ష కన్స్ట్రక్షన్ యజమాని హర్షవర్ధన్ రెడ్డి TG 24A 9999 నెంబర్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ నెంబర్ కోసం చాలామంది పోటీ పడ్డారు. ఆన్‌లైన్ వేలం పాటలో చివరకు అత్యధిక ధర చెల్లించి హర్షవర్ధన్ రెడ్డి దక్కించుకున్నారు.
తన కారుకు తన సెంటిమెంట్ లక్కీ నెంబర్ ఉండాలని ఏకంగా రూ. 11, 09, 999 ఖర్చు చేశాడు. ఇంత భారీ మొత్తం చలానా చెల్లించడంతో వరంగల్ ఆర్టీఏ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఆ వ్యాపారవేత్త చాలా రోజులుగా ప్రయత్నిస్తుండగా ఎట్టకేలకు ఈసారి భారీ మొత్తం వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో వరంగల్ ఆర్టీవో అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ 9, 99, 999, 9999 గల ఫ్యాన్సీ నెంబర్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫిక్స్డ్ ధర 50,000 రూపాయలు కాగా.. పోటీ పెరగడంతో పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని తెలిపారు.
0009 నెంబర్ కూడా రికార్డు ధర రూ 5,72,999 ధర పలికింది. 0009 నెంబర్‌ను మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ కైవసం చేసుకున్నారు. గత రెండు రోజులుగా వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల ఆన్లైన్ వేలంలో ఈ నెంబర్లను కైవసం చేసుకున్నారు. 0009 నెంబర్‌ను మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ కైవసం చేసుకున్నారు. ఈ నెంబర్‌కు రవాణాశాఖ నిర్ణయించిన ధర రూ.50 వేలు కాగా.. ఆ నెంబర్ కోసం మరికొందరు పోటీ పడ్డారు. వారికి ఆన్లైన్‌లో రహస్య వేలం నిర్వహించగా రూ. 5,72,999కు సుస్మితాపటేల్ దక్కించుకున్నారు. 0001 నెంబర్‌ను రూ. 1,11,111లకు దక్కించుకున్నారు. 0003 నెంబర్‌ను ఓ వాహనదారుడు రూ. 86,000కు కైవసం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి