IND vs ENG 4th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (India vs England) ఇప్పుడు నాల్గవ మ్యాచ్‌కు చేరుకోనుంది. రెండు జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌లోని తదుపరి మ్యాచ్ మాంచెస్టర్‌లో జరగనుంది. మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత, టీమిండియా కొన్ని మార్పులతో మైదానంలోకి దిగవచ్చు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టు నుంచి తొలగించాల్సి రావచ్చు.
ఈ మార్పుల మధ్య, ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. దీంతో భారత జట్టుకు (Team India) కొత్త ఎంపికలు రానున్నాయి. దీంతో పాటు, చాలా కాలం తర్వాత ఒక ఆటగాడు జట్టులోకి తిరిగి రావచ్చు. కాబట్టి జులై 23 నుంచి ఎమిరేట్స్ ఓల్డ్ టార్ఫోర్డ్‌లో జరగనున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాబబుబుల్ ప్లేయింగ్ XIని ఓసారి పరిశీలిద్దాం..
మాంచెస్టర్ టెస్ట్ కోసం టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
ఓపెనింగ్ జోడీ: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్: ఈ సిరీస్‌లో ఇప్పటివరకు యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో అతను తన తుఫాను బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని స్థిరత్వం జట్టుకు చాలా ముఖ్యమైనది. మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో అతని బ్యాట్ నుంచి హాఫ్ సెంచరీ వచ్చింది. అయితే, లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
మరోవైపు, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. లీడ్స్ తర్వాత లార్డ్స్‌లో సెంచరీ చేసిన కొన్ని సందర్భాల్లో అతను జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. మాంచెస్టర్‌లో కూడా అతను అదేవిధంగా ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు. జట్టుకు ఘనమైన ఆరంభాన్ని అందించే బాధ్యత వారిద్దరిపై ఉంటుంది.
బ్యాటర్లు, ఆల్ రౌండర్లు: శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా: మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు ఉండవచ్చు. నిజానికి, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కరుణ్ నాయర్ ప్రదర్శన అస్సలు బాగా లేదు. చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన ఈ ఆటగాడు తన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, అతన్ని మూడవ టెస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది.
అతని స్థానంలో, అభిమన్యు ఈశ్వరన్ జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించే అవకాశం ఉంది. బెంగాల్ తరపున 103 మ్యాచ్‌ల్లో 48.70 సగటుతో 7841 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం లభిస్తే, అతను తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించడానికి ప్రయత్నిస్తాడు.
కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాలుగో స్థానంలో రావచ్చు. 2025 అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి మ్యాచ్‌లో 147 పరుగులు చేసిన తర్వాత, ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు పూర్తి చేయడంలో అతను విజయవంతమయ్యాడు. అతను 269 పరుగులు, 161 పరుగుల బలమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
రిషబ్ పంత్‌ను ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపవచ్చు. 27 ఏళ్ల ఈ ఆటగాడి బ్యాట్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో రాణిస్తోంది. అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 83.20 సగటుతో 416 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ తర్వాత ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.
రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు రావచ్చు. లీడ్స్ లో ఘోర పరాజయం తర్వాత, అతను సిరీస్ లో గొప్ప పునరాగమనం చేశాడు. తన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుతంగా రాణించాడు. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో, అతను 72 పరుగులు చేసి భారత స్కోరు బోర్డు 387 పరుగులు సాధించడంలో సహాయపడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డి జట్టులో మరో ఆల్ రౌండర్ అవుతాడు. అతను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలింగ్‌తో కూడా తన వంతు పాత్ర పోషించగలడు.
బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్: ఈ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించుకోవచ్చు. అతని ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని, జట్టు యాజమాన్యం అతనిపై అదనపు ఒత్తిడి తీసుకురావాలని కోరుకోవడం లేదు. సిరీస్ ప్రారంభానికి ముందు, జస్ప్రీత్ బుమ్రా ఐదు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలడని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. దీనిని ఫాస్ట్ బౌలర్ కూడా ధృవీకరించాడు.
జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ కు అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చు. పంజాబ్ తరపున 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 66 వికెట్లు పడగొట్టాడు. అతని స్వింగ్, లెంగ్త్ నియంత్రణ అతన్ని సమర్థవంతంగా చేస్తాయి. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో, మహ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు చేపడతాడు.
వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులో చేర్చవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లలో బాగా రాణించడంలో విఫలమయ్యాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో అతను అందరినీ నిరాశపరిచాడు.
కుల్దీప్ యాదవ్ గురించి చెప్పాలంటే, అక్టోబర్ 2024 నుంచి అతనికి టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. అతని మణికట్టు స్పిన్, వికెట్ తీసే ధోరణి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందుల్లో పడేస్తుంది. దీంతో పాటు, ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్‌ను ప్లేయింగ్ XIలో ఉంచారు. అతను రెండు మ్యాచ్‌లలో మూడు ఇన్నింగ్స్‌లలో 4.34 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టడం ద్వారా తన డేంజరస్ బౌలింగ్‌ను నిరూపించుకున్నాడు. అతను మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు సహాయం అందించగలడు.
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..