ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై శనివారం దాడి చేశారు. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు..