Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tirumala Vip Break Darshan Cancelled July 15 16,తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. రెండ్రోజులు ఆ దర్శనాలు రద్దు, టైమింగ్స్ కూడా మారాయి – tirumala ttd cancelled vip break darshan on july 14 and 15 due to anivara asthanam

14 July 2025

Tirumala Darshan Devotees Heavy Rush,తిరుమలలో ఇలా జరగడం విచిత్రంగా ఉందే.. మళ్లీ చాలా రోజుల తర్వాత, ఏమైందంటే – tirumala devotees heavy rush at due to weekend waiting time for darshan

14 July 2025

Annamayya Lorry Accident,అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి – annamayya district road accident pullampet lorry crash

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Konaseema Retired Teacher 15 Lakh Current Bill,షాకిచ్చిన అధికారులు.. రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు.. – ambedkar konaseema district retired teacher get rs 15 14 lakh electricity bill for month
ఆంధ్రప్రదేశ్

Konaseema Retired Teacher 15 Lakh Current Bill,షాకిచ్చిన అధికారులు.. రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు.. – ambedkar konaseema district retired teacher get rs 15 14 lakh electricity bill for month

.By .13 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Konaseema Retired Teacher 15 Lakh Current Bill,షాకిచ్చిన అధికారులు.. రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు.. – ambedkar konaseema district retired teacher get rs 15 14 lakh electricity bill for month
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్‌కు విద్యుత్ శాఖ వారు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 15 లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో ఆయన దిమ్మతిరిగింది. ప్రతి నెల వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు.. ఒక్కసారిగా లక్షల్లోకి ఎలా పెరిగిందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. డిజిటల్ మీటర్లు వచ్చాకే బిల్లులు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తారో లేదో చూడాలి.

రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ.15 లక్షల కరెంట్ బిల్లు
రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ.15 లక్షల కరెంట్ బిల్లు (ఫోటోలు– Samayam Telugu)

సామాన్యుల ఇళ్లకు కరెంట్ బిల్లు అంటే తక్కువలో తక్కువ రూ.1000 లేదంటే వేసవి కాలం అయితే కూలర్ లాంటివి వాడితే రూ.2 వేల వరకు వస్తుంది. కాస్త కలిగిన కుటుంబం అంటే ఏసీ, హీటర్, ఐరన్ బాక్స్ వంటివి అధికంగా వినియోగిస్తే బిల్లు భారీగా వస్తుంది. ఎంత భారీగా అయినా సరే లక్షల రూపాయల కరెంటు బిల్లు మాత్రం రాదు. కానీ ఈమధ్య కాలంలో పేద, సామాన్యుల నివాసాలకు విద్యుత్ అధికారులు లక్షల రూపాయల కరెంట్ బిల్లులు వేసి.. వారికి గట్టి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఏపీలో ఓ రిటైర్డ్ టీచర్‌కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన ఇంటికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయలకు పైగా కరెంట్ బిల్లు వేసి ముట్టుకోకుండానే షాక్ ఇచ్చారు అధికారులు. ఆవివరాలు..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక వింత సంఘటన జరిగింది. మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి ఏకంగా రూ. 15,14,993 కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన షాక్ అయ్యారు. ప్రతి నెల రూ. 1300 వరకు బిల్లు వచ్చేది. కానీ ఈసారి మాత్రం భారీగా బిల్లు రావడంతో ఆయన విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్నేషా హుస్సేన్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం డిజిటల్ మీటర్లు పెట్టినప్పటి నుండి సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ మీటర్లు వచ్చినప్పటి నుంచి సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం అధికమైంది అని ఆయన అన్నారు. అధికారులు ఈ విషయాన్ని విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనకు వచ్చిన బిల్లును చూసి ఆయన చాలా ఆందోళన చెందుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన వాపోతున్నారు.

గత కొన్ని రోజులుగా ఏపీలో కరెంట్ వైర్లను తాకకుండానే ప్రజలకు షాక్ తగులుతోంది. విద్యుత్ సిబ్బంది నిర్వాకంతో బిల్లుల్లో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి.కానీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రాజోలు మండలం పొదలాడకు చెందిన ఓ కిరాణా షాపు ఓనర్’కి లక్ష రూపాయలు పైగా కరెంట్ బిల్లు విధించి షాకిచ్చారు అధికారులు.

నెల రోజులకే రూ.1,01,603 వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఆ శాఖ ఏఈను వివరణ కోరగా.. ఆ షాప్‌కి కొన్ని రోజుల క్రితమే కొత్తగా స్మార్ట్‌మీటర్‌ బిగించారని.. పాత మీటర్‌లోని రీడింగ్‌ కూడా కలిసిపోయి అధిక మొత్తంలో వచ్చిందని వివరించారు. దీన్ని సరిచేశామని తెలిపారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి