Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Food: ఈ నత్తల కూర వరల్డ్ ఫేమస్.. ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

15 July 2025

స్టార్ హీరోయిన్లకే చెమటలు పట్టించింది.. సూపర్ స్టార్ ఇంటికి కోడలిగా వెళ్లాల్సింది.. చివరకు భర్తపై..

15 July 2025

క్యాన్సర్‌తో తల్లి మరణం.. రెస్టారెంట్‌లో రోజుకు 12 గంటలు పని.. బుమ్రా, అక్షర్ బెస్ట్ ఫ్రెండ్ శాడ్ స్టోరీ వింటే కన్నీళ్లే

15 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Justice Devanand Battu To Ap High Court,ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తి జసిస్ట్ బట్టు దేవానంద్ బదిలీ.. ఆయన సోదరుడు ఏపీలోని ఆ జిల్లాకు కలెక్టర్ – justice battu devanand transferred to andhra pradesh high court
ఆంధ్రప్రదేశ్

Justice Devanand Battu To Ap High Court,ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తి జసిస్ట్ బట్టు దేవానంద్ బదిలీ.. ఆయన సోదరుడు ఏపీలోని ఆ జిల్లాకు కలెక్టర్ – justice battu devanand transferred to andhra pradesh high court

.By .15 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Justice Devanand Battu To Ap High Court,ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తి జసిస్ట్ బట్టు దేవానంద్ బదిలీ.. ఆయన సోదరుడు ఏపీలోని ఆ జిల్లాకు కలెక్టర్ – justice battu devanand transferred to andhra pradesh high court
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Justice Devanand Battu: జస్టిస్‌ బట్టు దేవానంద్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో మద్రాస్ హైకోర్టు నుండి ఆయన తిరిగి వస్తున్నారు. త్వరలో ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన 2028 వరకు పదవిలో ఉంటారు. జస్టిస్‌ దేవానంద్ గతంలోనూ ఇక్కడ పనిచేసి, ఆ తర్వాత బదిలీ అయ్యారు. మళ్ళీ సొంత గూటికి చేరడంతో న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన రాకతో హైకోర్టు మరింత బలోపేతం కానుంది.

హైలైట్:

  • ఏపీ హైకోర్టుకు జస్టిస్ బట్టు దేవానంద్
  • మద్రాసు హైకోర్టు నుంచి బదిలీ చేశారు
  • ఆయన సోదరుడు ఏపీలో ఆ జిల్లా కలెక్టర్
ఏపీ హైకోర్టుకు జస్టిస్ దేవానంద్ బదిలీ
ఏపీ హైకోర్టుకు జస్టిస్ దేవానంద్ బదిలీ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్‌ బట్టు దేవానంద్ తిరిగి బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేయడంతో ఆయన మద్రాస్ హైకోర్టు నుంచి మళ్లీ ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ త్వరలో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్‌ దేవానంద్ 2028 ఏప్రిల్ 13 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. వాస్తవానికి ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉంది.. జస్టిస్‌ బట్టు దేవానంద్ రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుతం జస్టిస్ బట్టు దేవానంద్ హైకోర్టులో 4వ స్థానంలో ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది మే 26న సమావేశమైంది. ఈ మేరకు జస్టిస్ బట్టు దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టు నుంచి తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని.. సిఫార్సు చేసింది.. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

జస్టిస్‌ బట్టు దేవానంద్ కృష్ణా జిల్లా గుడివాడలో 1966 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బట్టు వెంకటరత్నం, మనోరంజితం ప్రభుత్వ ఉపాధ్యాయులు. దేవానంద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989 జులై 6న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీసు చేసిన అనంతరం హైకోర్టుకు మార్చారు. 1996 నుంచి 2000 వరకు ఏపీ హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా.. 2006లో ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు.

టీచర్‌గా మారిన చంద్రబాబు.. పిల్లలకు పాఠాలు.. లోకేష్ కూడా శ్రద్ధగా

2014 జులై నుంచి 2019 మే వరకు ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. 2020 జనవరి 13న జస్టిస్‌ దేవానంద్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.. 2023 ఏప్రిల్‌ 10న మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్‌ దేవానంద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు.. ఆయన సోదరుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ప్రస్తుతం విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి