Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sarke Chunar Song: పాటలో బూతు పదాలు.. దర్శకుడు చెప్పడం వల్లే రాశాను.. గీతా రచయిత కామెంట్స్..

18 March 2026

Kuldeep Yadav Wedding Reception : లక్నోలో కుల్దీప్ గ్రాండ్ రిసెప్షన్.. విందులో వెరైటీ వంటకాలు.. మెనూ చూస్తే మైండ్ బ్లాకే

18 March 2026

Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం.. రైతు బజార్ల నుంచి నేరుగా మీ ఇంటికే కూరగాయలు, పండ్లు.. ఈ యాప్‌లో బుకింగ్..

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»నందికొట్కూరు మహిళ మర్డర్ కేసులో ట్విస్ట్.. 9ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న కుమారుడు..!
తాజా వార్తలు

నందికొట్కూరు మహిళ మర్డర్ కేసులో ట్విస్ట్.. 9ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న కుమారుడు..!

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
నందికొట్కూరు మహిళ మర్డర్ కేసులో ట్విస్ట్.. 9ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న కుమారుడు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

నందికొట్కూరు మహిళ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. తన తండ్రిని చంపిందనే కారణంగానే 9ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు పగ తీర్చుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరులో మహిళ దారుణం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నందికొట్కూరు పట్టణంలోని మారుతినగర్ లో నివాసముంటున్న శాలుబీ గురువారం(సెప్టెంబర్ 5) అర్ధరాత్రి వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్, నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ తో ఆ స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. శాలుబీని చందు అనే యువకుడు, బీహార్‌కి చెందిన వ్యక్తులతో కలిసి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది.

ఈకేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇంట్లో ఉన్న శాలుబీని నాటు తుపాకీతో చంపినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బయటపడింది. శాలుబీ మృతదేహంలో నాటు తుపాకీ బుల్లెట్లను గుర్తించారు. నిందితుల్లో బీహార్ యువకుడి గదిలో రెండు నాటు తుపాకులు, 8బుల్లెట్లను గుర్తించినట్లు సమాచారం. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మర్డర్‌ కేసు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

హత్యకు గురైన శాలుబీ పై కూడా సస్పెక్ట్ షీట్‌లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆమెపై నందికొట్కూరులో పీఎస్‌లో 6 కేసులు, కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో 4 కేసులు నమోదయ్యాయి. హత్య, పలు చోరీ కేసుల్లో శాలు బీ నిందితురాలిగా ఉంది. 2015లో నందికొట్కూరులో గజేంద్ర అనే వ్యక్తిని హత్య చేసింది శాలుబీ. ఆ హత్యకు ప్రతీకారంగానే శాలుబీని బీహార్‌ యువకునితో కలసి హత్య చేశాడు గజేంద్ర కుమారుడు చందు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పోలీసులు.. శాలుబీ హత్యపై కీలక విషయాలను గోప్యంగా ఉంచారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Sarke Chunar Song: పాటలో బూతు పదాలు.. దర్శకుడు చెప్పడం వల్లే రాశాను.. గీతా రచయిత కామెంట్స్..

18 March 2026

Kuldeep Yadav Wedding Reception : లక్నోలో కుల్దీప్ గ్రాండ్ రిసెప్షన్.. విందులో వెరైటీ వంటకాలు.. మెనూ చూస్తే మైండ్ బ్లాకే

18 March 2026

ఎన్నికల వేళ ఎన్నెన్నీ సిత్రాలో.. ఓటర్ల కోసం భారీగా తాయిలాలు సిద్ధం..మామూలు కానుకలు కాదండోయ్..!

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Sarke Chunar Song: పాటలో బూతు పదాలు.. దర్శకుడు చెప్పడం వల్లే రాశాను.. గీతా రచయిత కామెంట్స్..

18 March 2026

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి నటింటిన సర్కే చునార్ తేరీ సర్కే సాంగ్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని…

Kuldeep Yadav Wedding Reception : లక్నోలో కుల్దీప్ గ్రాండ్ రిసెప్షన్.. విందులో వెరైటీ వంటకాలు.. మెనూ చూస్తే మైండ్ బ్లాకే

18 March 2026

Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం.. రైతు బజార్ల నుంచి నేరుగా మీ ఇంటికే కూరగాయలు, పండ్లు.. ఈ యాప్‌లో బుకింగ్..

18 March 2026

ఎన్నికల వేళ ఎన్నెన్నీ సిత్రాలో.. ఓటర్ల కోసం భారీగా తాయిలాలు సిద్ధం..మామూలు కానుకలు కాదండోయ్..!

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Sarke Chunar Song: పాటలో బూతు పదాలు.. దర్శకుడు చెప్పడం వల్లే రాశాను.. గీతా రచయిత కామెంట్స్..

18 March 2026

Kuldeep Yadav Wedding Reception : లక్నోలో కుల్దీప్ గ్రాండ్ రిసెప్షన్.. విందులో వెరైటీ వంటకాలు.. మెనూ చూస్తే మైండ్ బ్లాకే

18 March 2026

Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం.. రైతు బజార్ల నుంచి నేరుగా మీ ఇంటికే కూరగాయలు, పండ్లు.. ఈ యాప్‌లో బుకింగ్..

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.